బిగ్ బాస్ గంగవ్వకు చిరంజీవి అదిరిపోయే ఆఫర్: మెగాస్టార్ చేసిన పనికి షాక్‌లో సహజ నటి

దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ.. ఇప్పటికీ అదే గ్రేస్‌తో యాక్టింగ్ చేస్తున్నారు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారాయన. రాజకీయాల కోసం చాలా కాలం పాటు సినిమాలకు బ్రేకిచ్చిన చిరు.. సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఇది పూర్తి కాకముందే మరో మూడు ప్రాజెక్టులను ప్రకటించి అందరికీ షాకిచ్చారు.

గత లాక్‌డౌన్ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన 'గాడ్ ఫాదర్' అనే సినిమాను చేస్తున్నారు. సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ తెరకెక్కించిన మలయాళ చిత్రం 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయిపోయింది. ఆ వెంటనే షెడ్యూళ్ల మీద షెడ్యూళ్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది.

Gangavva Key role in Chiranjeevis God Father Movie

'లూసీఫర్' మూవీలో అసలు హీరోయిన్ పాత్రే ఉండదు. అయితే, తెలుగు నేటివిటీకి అనుగుణంగా చిరంజీవి చేసే సినిమాలో ఆ రోల్‌ను యాడ్ చేశాడు దర్శకుడు మోహన్ రాజా. ఇక, ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ సమయంలోనే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడిచింది. కొద్ది రోజులకు ఆమె చేసేది చిరంజీవి చెల్లెలి పాత్ర అన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో అందరిలో అయోమయం నెలకొంది. అయినప్పటికీ యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

మోహన్ రాజా తెలుగు వెర్షన్ కోసం ఎన్నో మార్పులు చేశాడు. అందులో హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఎంతో ముఖ్యమైనదని తెలుస్తోంది. ఇందులో హీరో చిన్నప్పటి పాత్ర నుంచి హీరోయిన్ ఎంట్రీ వరకూ చూపించబోతున్నారట. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ ఎపిసోడ్‌లో మదర్ సెంటిమెంట్‌కు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది. ఇందులో చిరంజీవి తల్లిగా సహజ నటి గంగవ్వను తీసుకున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేసుకుంది మెగాస్టారే అని అంటున్నారు. ఇక, ఈ ఆఫర్‌ విషయం తెలిసిందే వెంటనే ఆమె షాక్ అయిందని తెలుస్తోంది.

పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యంతో సాగే 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా నటిస్తున్నారు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందించబోతున్నాడు. సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X