గంగోత్రి బాలనటి హీరోయిన్‌గా మసూద.. ఆసక్తిరేపుతున్న హారర్ డ్రామా

మ‌ళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ లాంటి ఫీల్ గుడ్ మూవీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న బ్యానర్ స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్. ఈ బ్యానర్‌లో మూడో చిత్రంగా రూపొందిన మ‌సూద త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. విభిన్నమైన కథ, కథనాలకు అడ్రస్‌గా మారిన బ్యానర్‌లో వస్తున్న సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఇటీవల విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలో చిత్ర టీజర్‌ను విడుదల చేసేందుకు స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమవుతున్నది. విలక్షణమైన టైటిల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న మసూద చిత్రం టీజర్ ఆగస్టు 2వ తేదీన రిలీజ్ కానున్నది.

మళ్లీరావా చిత్రంతో గౌతమ్ తిన్ననూరి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో స్వరూప్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.. హరర్ డ్రామా జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో ప్రామిసింగ్ డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

Gangothri fame Kavya Kalyanrams Masooda teaser on 2nd August

ఇప్పటికే విభిన్నమైన పాత్రలతో టాలీవుడ్‌లో పేరు సంపాదించుకొన్న జార్జిరెడ్డి ఫేమ్ తిరువీర్ ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. గంగోత్రి చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇతర వివరాలు, రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని యూనిట్ తెలిపింది.

నటీనటులు: తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, సంగీత, శుభలేఖ సుధాకర్, అఖిల రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాశ్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణ తేజ తదితరులు
రచన, దర్శకత్వం: సాయికిరణ్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
ఆర్ట్: క్రాంతి ప్రియం
కెమెరా: నగేష్ బనెల్
స్టంట్స్: రామ్ కిషన్ అండ్ స్టంట్ జాషువా
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
ఎడిటింగ్: జెశ్విన్ ప్రభు
పీఆర్వో: బి. వీరబాబు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X