గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయువేగం, గం గం గణేషా.. దేని క్రేజ్ ఎక్కువో తెలుసా?

మే నెల చివరి వారంలో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా గత నెల 31వ తేదీ రోజు మూడు సూపర్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఈక్రమలోనే సినీ ప్రియులు అందరూ తమకు నచ్చిన చిత్రాలు చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. తమ అభిమాన హీరో, లేకపోతే పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలను ఫ్యామిలీతో కలిసి వీక్షించేందుకు పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో.. అంటే జూన్ 1వ తేదీ ఉదయం నుంచి జూన్ 2వ తేదీ ఉదయం వరకు ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి.. ఏ సినిమాను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గడిచిన 24 గంటల్లలో బుక్ మై షోలో ఎక్కువగా బుక్ అయిన టికెట్లు, ఏయే సినిమాల టికెట్లు అందుబాటులో ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఈ వారం విడుదల అయిన సినిమాల్లో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తికేయ భజే వాయు వేగం, ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమాల్లో.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా టికెట్లు ఎక్కువగా అమ్ముడు పోయాయి. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. విశ్వక్‌సేన్, నేహాశెట్టి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 25న విడుదల చేసి, సినిమాను మే 31న విడుదల చేశారు.

Gangs of Godavari Movie Sold The Most Tickets in June 2024 Cinemas And List is Here Check Details

అద్భుతమైన యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమాను చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఒక్క బుక్ మై షో ద్వారానే గడిచిన 24 గంటల్లో 46.72k టికెట్లు అమ్ముడు పోయాయి. అంటే 46 వేల 720 మంది ప్రేమలు సినిమా చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇలా టాప్ లో విశ్వక్ సేన్ హీరోగా చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నిలిచింది.

Gangs of Godavari Movie Sold The Most Tickets in June 2024 Cinemas And List is Here Check Details

ఇక టాప్ 2లో కార్తికేయ భజే వాయు వేగం సినిమా నిలిచింది. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీనే భజే వాయు వేగం. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటించగా.. రవిశంకర్, కృష్ణ చైతన్య, తణికెళ్ల భరణి, రాహుల్ టైసన్ తదితరులు నటించారు. కపిల్ కుమార్ సంగీతాన్ని అందించారు. మే 31వ తేదీన విడుదల అయిన ఈ సినిమాను చూసేందుకు బుక్ మై షో ద్వారా గడిచిన 24 గంటల్లో 20.06కే టికెట్లు అమ్ముడు పోయాయి. అంటే 20 వేల 60 మంది ఈ సినిమాను చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు.

Gangs of Godavari Movie Sold The Most Tickets in June 2024 Cinemas And List is Here Check Details

ఇక టాప్ 3లో గం గం గణేశా నిలిచింది. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లు ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక నటించిన చిత్రం గం.. గం.. గణేశా చిత్రాన్ని హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. మే 31వ తేదీన రిలీజైన ఈ చిత్రానికి గడిచిన 24 గంటల్లో 12.97కే టికెట్లు అమ్ముడు పోయాయి. అంటే 12 వేల 970 మంది ఈ సినిమాను చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X