Don't Miss!
- News
Vastu tips: ఇంట్లో మహిళలకు ఎప్పుడూ రోగాలా? ఈ వాస్తు దోషాలతోనే కావచ్చు!!
- Lifestyle
Today Rasi Palalu 24 January 2023: ఈ రోజు మిథున రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక పరిస్థి గొప్ప మెరుగుదల
- Sports
సూర్యకుమార్ యాదవ్.. నా బెస్ట్ ఫ్రెండ్.. అతను నాలాగే ఇబ్బంది పడ్డాడు: సర్ఫరాజ్ ఖాన్
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Oscars 2023: ఆస్కార్ బరిలో 10 ఇండియన్ సినిమాలు.. కాంతారతోపాటు కశ్మీర్ ఫైల్స్ గంగుబాయి, రాకేట్రీ!
సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ఆస్కార్. జీవితంలో ఒక్కసారైన ఈ అవార్డ్ అందుకోవాలని ప్రతి నటుడు, కళాకారుడు కోరుకుంటాడు. ఈ అవార్డ్ కోసం దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRR తెగ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటుతోపాటు ఉత్తమ నటులు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో ఆస్కార్ కు పోటీ పడుతోంది. ఇటీవల ఆస్కార్ బరిలో కాంతార కూడా నిలిచింది. ఇప్పుడు తాజాగా అకాడమీ అవార్డ్స్ కు అర్హత పొందిన ఇండియన్ సినిమాల జాబితాను విడుదల చేసింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ సైన్సెస్.

ఆస్కార్ వచ్చే అవకాశం..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన కళాఖండం RRR చిత్రానికి ఇప్పటికీ ప్రశంసలు అందుతున్నాయి. విదేశాల్లోనూ ఈ మూవీ భారతీయ సినిమాగా సత్తా చాటుతోంది. అంతేకాకుండా RRR మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు పాట ఉండగా.. ఉత్తమ నటులు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో పోటీపడుతోంది.
కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ నటనతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశారు. దీంతో RRR సినిమాకు కచ్చితంగా ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

అధికారిక ప్రకటన..
కన్నడ నాట చిన్న సినిమాగా మొదలైన కాంతార సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన సూపర్ హిట్ అందుకుంది. మొత్తంగా రూ. 400 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలిచింది.
కాంతార మూవీ బెస్ట్ యాక్టర్, బెస్ట్ పిక్చర్ రెండు విభాగాల్లో అకాడమీ అవార్డులకు క్వాలిఫై అయింది. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాణ సంస్థ హోంబళే ఫిలీంస్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆస్కార్ కు వచ్చిన 301 చిత్రాల నుంచి నామినేషన్స్ కు ఫైనలైజ్ అయిన భారతీయ చలన చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేసింది.

ఇండియా నుంచి 10 చిత్రాలు..
తాజాగా అకడామీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ పురస్కారాలకు అర్హత పొందిన భారతీయ చిత్రాల లిస్ట్ ను రిలీజ్ చేశారు. 'RRR', 'కాంతార' చిత్రాలతోపాటు అలియా భట్ 'గంగూభాయ్ కతియావాడి', 'కశ్మీర్ ఫైల్స్', 'ఛెలో షో', ఆర్ మాధవన్ 'రాకేట్రీ: ది నంబి ఎఫెక్ట్', 'ఇరవిన్ నిజాల్', మరాఠీ చిత్రాలైన 'మే వసంతరావు', 'తుజ్యా సతీ కహీ హై'తో పాటు కన్నడ మూవీ 'విక్రాంత్ రోణ' కూడా రిమైండర్ జాబితాలో బెస్ట్ పిక్చర్ విభాగాంలో రిమైండర్ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
అలాగే డ్యాక్యుమెంటరీ విభాగంలో 'ఆల్ దట్ బ్రీత్స్', 'ది ఎలిఫెంట్ విస్పర్స్' చిత్రాలు కూడా లిస్ట్ లో ఉన్నాయి. అయితే ఈ నెలలో ఆస్కార్ నామినేషన్స్ ఫైనల్ అవుతాయి. ఈ నామినేషన్లలో మన సినిమాలు నామినేట్ అయితే డైరెక్ట్ గా ఆస్కార్ అవార్డుల కోసం పోటీలో ఉన్నట్లు. ఈ ఫైనల్ జాబితాను జనవరి 24న ప్రకటిస్తారు.