For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమెరికాలో రాజశేఖర్ 92వ మూవీ షూట్.. గతం ఫేమ్ డైరెక్షన్‌లో థ్రిల్లర్ సినిమా

    |

    సినీ విమర్శకులతోపాటు సాధారణ ప్రేక్షకులను గతం చిత్రం ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. గతం చిత్రం అందించిన ఉత్సాహంతో ఈ చిత్ర యూనిట్ యాంగ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్‌తో 'శేఖర్' అనే చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఆఫ్‌బీట్ ఫిల్మ్స్, ఎస్ ఒరిజినల్స్, పెగసస్ సినీ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాతలు కిరణ్ కొండమడుగుల, భార్గవ పొలుదాసుతోపాటు హర్షా ప్రతాప్, సృజన్ యర్రబోలుతోపాటు రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన థీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

    ఈ సందర్భంగా డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా గతంను హిట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. ఆ తర్వాత నా రెండో సినిమాను రాజశేఖర్ గారితో యాక్షన్, థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నా. సెక్స్ ట్రాఫికింగ్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నేపథ్యంగా సినిమా సాగుతుంది. ఈ సినిమా షూట్ అంతా అమెరికాలో జరుగుతుంది. హీరో క్యారెక్టరైజేషన్ ఇంటెన్సివ్‌గా ఉంటుంది. ఈ పాత్రకు రాజశేఖర్ చక్కగా సరిపోతారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియెన్స్ థ్రిల్లింగ్‌గా ఫీలవుతారు అని అన్నారు.

    Gatham Fame Kiran Kondamadugula to direct Rajasekhars Sekhar

    నిర్మాత భార్గవ మాట్లాడుతూ... గతం చిత్రంలో అర్జున్ అనే పాత్రలో నటించాను. ఆ సినిమాకు నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించాను. ప్రస్తుతం రాజశేఖర్‌ గారితో సినిమా రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలోని పాత్రకు రాజశేఖర్ పర్‌ఫెక్ట్‌గా సరిపోతారు. గతం చిత్రం మాదిరిగానే శేఖర్ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావంతో ఉన్నాం అని అన్నారు.

    నిర్మాత హర్ష ప్రతాప్ మాట్లాడుతూ.. గతం చిత్రానికి సంబంధించిన నిర్మాతల్లో నేను ఒకరిని. కిరణ్ గారితో మరోసారి టీమ్‌గా ఏర్పడ్డాం. స్క్రిప్టు డిమాండ్ మేరకు రాజశేఖర్ గారి 92వ చిత్రం షూటింగ్ మొత్తం అమెరికాలోనే సాగుతుంది. ఆగస్టులో షూటింగ్‌ ప్రారంభించేందుకు ప్లాన్ చేశాం. క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ సినిమాను రూపొందిస్తాం. హాలీవుడ్ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్‌కు ప్రేక్షకులు గురి అవుతారు. స్రిప్టు బ్రహ్మండంగా వచ్చింది అని తెలిపారు.

    English summary
    Angry Star' Rajasekhar's new movie and 92nd film of his career has announced on Saturday. This is going to be the versatile actor's 92nd movie. Kiran Kondamadugula, who got both audience's acceptance and critical acclaim for his debut movie 'Gatham' (2020), is going to direct it. This is the first outing of the actor-director duo. Off Beat Films, S Originals and Pegasus Cine Corp have come together to produce this promising action thriller. Bhargava Poludasu, Harsha Pratap, Srujan Yarabolu and Rajasekhar's daughters, Shivani and Shivathmika, are producing it. A Theme Poster was released to make the project official. Rajasekhar will start shooting for the movie form August, after the completion of his ongoing project, 'Sekhar'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X