Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అమెరికాలో రాజశేఖర్ 92వ మూవీ షూట్.. గతం ఫేమ్ డైరెక్షన్లో థ్రిల్లర్ సినిమా
సినీ విమర్శకులతోపాటు సాధారణ ప్రేక్షకులను గతం చిత్రం ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. గతం చిత్రం అందించిన ఉత్సాహంతో ఈ చిత్ర యూనిట్ యాంగ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్‌తో 'శేఖర్' అనే చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఆఫ్‌బీట్ ఫిల్మ్స్, ఎస్ ఒరిజినల్స్, పెగసస్ సినీ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాతలు కిరణ్ కొండమడుగుల, భార్గవ పొలుదాసుతోపాటు హర్షా ప్రతాప్, సృజన్ యర్రబోలుతోపాటు రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన థీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా గతంను హిట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. ఆ తర్వాత నా రెండో సినిమాను రాజశేఖర్ గారితో యాక్షన్, థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నా. సెక్స్ ట్రాఫికింగ్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నేపథ్యంగా సినిమా సాగుతుంది. ఈ సినిమా షూట్ అంతా అమెరికాలో జరుగుతుంది. హీరో క్యారెక్టరైజేషన్ ఇంటెన్సివ్‌గా ఉంటుంది. ఈ పాత్రకు రాజశేఖర్ చక్కగా సరిపోతారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియెన్స్ థ్రిల్లింగ్‌గా ఫీలవుతారు అని అన్నారు.
నిర్మాత భార్గవ మాట్లాడుతూ... గతం చిత్రంలో అర్జున్ అనే పాత్రలో నటించాను. ఆ సినిమాకు నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించాను. ప్రస్తుతం రాజశేఖర్ గారితో సినిమా రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలోని పాత్రకు రాజశేఖర్ పర్ఫెక్ట్గా సరిపోతారు. గతం చిత్రం మాదిరిగానే శేఖర్ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావంతో ఉన్నాం అని అన్నారు.
నిర్మాత హర్ష ప్రతాప్ మాట్లాడుతూ.. గతం చిత్రానికి సంబంధించిన నిర్మాతల్లో నేను ఒకరిని. కిరణ్ గారితో మరోసారి టీమ్‌గా ఏర్పడ్డాం. స్క్రిప్టు డిమాండ్ మేరకు రాజశేఖర్ గారి 92వ చిత్రం షూటింగ్ మొత్తం అమెరికాలోనే సాగుతుంది. ఆగస్టులో షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేశాం. క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ సినిమాను రూపొందిస్తాం. హాలీవుడ్ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్‌కు ప్రేక్షకులు గురి అవుతారు. స్రిప్టు బ్రహ్మండంగా వచ్చింది అని తెలిపారు.