హీరోయిన్ గౌతమి ఇంట్లోకి చొరబడిన అగంతకుడు.. తప్పతాగి నానా రచ్చ
సీనియర్ హీరోయిన్ గౌతమి ఇంట్లోకి అగంతకుడు చొరబడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కమల్ హాసన్‌తో విడిపోయిన తర్వాత ప్రస్తుతం గౌతమి చెన్నైలోని కొట్టివాకంలో నివాసం ఉంటున్నారు. అయితే మంగళవారం రోజున ఓ వ్యక్తి తప్పతాగి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. గోడదూకి రావడంతో సిబ్బంది, ఇంట్లోని వారు అభద్రతాభావానికి గురయ్యారు.
తాగిన మైకంలో నానా యాగీ చేయడంతో భయాందోళనలకు లోనయ్యారు. అగంతకుడు ప్రవేశించారని పోలీసులకు సమాచారం అందించిన వెంటనే నీలంగరై పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తిని పాండ్యన్ అని గుర్తించారు. పబ్లిక్ న్యూసెన్స్, అనుమతి లేకుండా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన కొట్టివాక్కం ప్రాంతంలో సంచలనం రేపింది.
గౌతమి కెరీర్ విషయానికి వస్తే.. కమల్ హాసన్‌తో కలిసి పాపనాశనం అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆమె తుప్పరివాలన్ 2 చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్, ప్రసన్న, రెహ్మాన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











