Ustaad Bhagat Singh: పవన్ తల్లిగా ఆ హీరోయిన్.. ఈ యంగ్ బ్యూటీకి షాక్ తప్పదా?

టాలీవుడ్‌లోని ఏ స్టార్ హీరో చేయని విధంగా ఏకకాలంలోనే మూడు నాలుగు సినిమాలను చేస్తూ దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఏ ముహూర్తన రీఎంట్రీ ఇచ్చాడో కానీ, అప్పటి నుంచి జెట్ స్పీడుతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఇప్పుడు కూడా మూడు సినిమాలను చేస్తున్నాడు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. 'గబ్బర్ సింగ్' వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ స్టార్ హీరో చేస్తున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో అత్యుత్తమ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

Gautami Plays Pawan Kalyan Mother Role in Ustaad Bhagat Singh Movie

'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్నారు. అలాగే మిగిలిన షెడ్యూళ్లను కూడా పక్కా ప్లాన్‌తో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు.

సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో పవన్ కల్యాణ్ తల్లిగా సీనియర్ హీరోయిన్ గౌతమి నటిస్తున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఆమెతో పవన్ కల్యాణ్ కాంబో సీన్స్‌ను షూట్ చేస్తున్నారట. ఇవన్నీ సినిమాలో ఎంతో ఎమోషనల్‌గా ఉంటాయని తెలిసింది. మొత్తంగా గౌతమి రోల్‌కు ఈ చిత్రంలో చాలా ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది.

Gautami Plays Pawan Kalyan Mother Role in Ustaad Bhagat Singh Movie

'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు 'ఏజెంట్', 'గాండీవధారి అర్జున' ఫేం సాక్షి వైద్యను మరో హీరోయిన్‌గా తీసుకోవాలని భావించారు. కానీ, ఊహించని విధంగా ఆమెకు చిత్ర యూనిట్ షాక్ ఇచ్చినట్లు తెలిసింది. కారణం ఏంటో కానీ.. సాక్షి స్థానంలో మరో యంగ్ బ్యూటీని తీసుకోవాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట.

ఇక, 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇందులో అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్‌లు కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X