Don't Miss!
- Lifestyle
మీ పార్ట్నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
- News
YS Avinash Reddy : అవినాష్ కు సీబీఐ ప్రశ్నలివే-2గంటలకు పైగా విచారణ-లాయర్ కూ నో ఎంట్రీ..!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
ఆ ఒక్కటి ఉంటేనా.. వర్మతో ఆ పని కానిచ్చేదాన్ని.. గాయత్రీ గుప్తా సంచలన కామెంట్స్
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మపైనే ఓ బాంబ్ పేల్చింది. ఆర్జీవీపై చేసిన కామెంట్స్ అందరికీ ఆశ్చర్యపరుస్తోంది. ఐస్ క్రీమ్2 సినిమాతో వర్మతో కలిసి పని చేసింది గాయత్రీ గుప్తా. ఆపై అడపాదడపా చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గాయత్రీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతోంది. అమె చేసిన కామెంట్స్ ఏంటి అన్నది ఓ సారి చూద్దాం.

శ్రీరెడ్డి చెప్పిందంతా నిజమే..
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాయత్రీ మాట్లాడుతూ.. శ్రీరెడ్డి చేసిన రచ్చేంటో తనకు తెలుసని.. ఆమె చెప్పనవన్నీ నిజమేనని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, కానీ శ్రీరెడ్డి అంత హంగామా చేసినప్పుడు నేను ఆమెకు ఫోన్ చేసి మాట్లాడానని తెలిపింది. ఆమె ఇచ్చిన సమాధానాలు విని ఈ రచ్చతో కలిగే ప్రయోజనాలు ఏమీ లేవు, ఎంతో కాలం నిలవదని అనిపించినట్టు పేర్కొంది.

అందరూ వాడుకుంటారు..
అందరూ అందర్నీ వాడుకుంటారని.. తన పీఆర్ కోసం ఇలా ఇంటర్వ్యూలు ఇస్తున్నాననీ, మీ టీఆర్పీ కోసం నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారని ఇలా అందరూ అందర్నీ వాడుకుంటారని చెప్పుకొచ్చింది. ఎప్పుడైన వేధింపులు ఎదురయ్యాయా? మోసపోయారా అని యాంకర్ అడిగితే.. మోస పోవడం అనేది కామన్ ఎక్కడైనా జరుగుతుంది కదా అని బదులిచ్చింది.

నేను పర్సనల్‌గా చూస్తే గానీ నమ్మను..
తాను వర్మను ఐస్‌క్రీమ్2 చిత్రం సమయంలో కలిశానని తెలిపింది. అంతకు ముందు ఆర్జీవీ గురించి విన్నానని కానీ అంతగా తెలీదని చెప్పుకొచ్చింది. తాను వ్యక్తిగతంగా తెలిస్తేనే ఎవరి గురించైనా ఓ అభిప్రాయానికి వస్తానని అంది. మూవీ షూటింగ్ సమయంలో షాట్ అయిపోయాక క్షణం కూడా ఉండేవాడు కాదని తెలిపింది.

ఏజ్ ఒక్కటి తక్కువగా ఉంటేనా..
ఆయనతో సినిమా చేయడం అంటే మ్యారథాన్‌లో పాల్గొన్నట్లే ఉంటుందని చెప్పుకుంటూ.. ఆయన యువకుడై ఉంటే బాగుండేదని తెలిపింది. తన కంటే ఓ ఐదేళ్లు పెద్దై ఉంటే బాగుండేదని గాయత్రీ అంటూ ఉంటే.. ఏం చేసేవారని సదరు యాంకర్ ప్రశ్నించాడు. ప్రపోజ్ చేసేదాన్ని, వెంటపడేదాన్ని ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకునేదాన్నంటూ మొహమాటం లేకుండా చెప్పేసింది.