For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఢిల్లీ మోడల్‌తో రవితేజ రొమాన్స్: ఒక్కరు కాదు.. ఇద్దరినీ పరిచయం చేసేశారుగా!

  |

  చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ సినీ కెరీర్‌ను ఆరంభించి.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత హీరోగా మారాడు మాస్ మహారాజా రవితేజ. ఆరంభంలోనే తనదైన శైలి నటనతో ప్రేక్షకులను అలరించిన అతడు.. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌కు మరింత చేరువ అయ్యాడు. దీంతో మాస్ మహారాజా అన్న బిరుదును అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడని అతడు.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకుంటున్నాడు. ఇక, ప్రస్తుతం ఈ మాస్ హీరో చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

  ప్రియుడికి శృతి హాసన్ సర్‌ప్రైజ్: స్పెషల్ డేన ఆ రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసి మరీ!

  కొన్నేళ్ల పాటు మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాపులతో తెగ ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది సంక్రాంతికి 'క్రాక్' అనే సినిమాతో మరోసారి విజయాల బాట పట్టాడు. ఇది అతడికి సక్సెస్‌ను అందించడమే కాదు.. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఫలితంగా రవితేజ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌‌ను ఖాతాలో వేసుకున్నట్లైంది. ఈ ఉత్సాహంతోనే రవితేజ ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను చేశాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశనే ఎదుర్కొంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం భారీ నష్టాలను చవి చూసింది.

   Gayatri Bhardwaj Onboard for Ravi Teja Tiger Nageswara Rao

  ఇదిలా ఉండగా.. మాస్ మహారాజా రవితేజ గత ఏడాది పలు చిత్రాలను ప్రారంభించాడు. అందులో 'రామారావు ఆన్ డ్యూటీ' ఒకటి. శరత్ మందవ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఆరంభం నుంచే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి చాలా వరకూ చిత్రీకరణ కూడా జరిగింది. దీనితో పాటు ఈ మాస్ హీరో 'రావణాసుర' అనే సినిమాను కూడా చేస్తున్నాడు. సుధీర్ వర్మ రూపొందిస్తోన్న ఈ సినిమా షూట్ కూడా నిరంతరాయంగా సాగుతోంది. దీనితో పాటు త్రినాథరావు నక్కినతో 'ధమాకా' అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఇది కూడా ఇప్పటికే కొన్ని షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది.

  Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత.. వాళ్ల కోసం దిగిన పిక్‌లో దారుణంగా!

  ఇప్పటికే చాలా చిత్రాలను పట్టాలెక్కించేసిన మాస్ మహారాజా రవితేజ.. ఇప్పుడు 'టైగర్ నాగేశ్వర్రావు' అనే పాన్ ఇండియా సినిమానూ ప్రకటించాడు. వంశీ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 1970 కాలంలో గజగజలాడించిన టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా రూపొందనుంది. ఏప్రిల్ 2 నుంచి ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కాబోతుంది. ఇక, ఈ సినిమాలో రవితేజ సరసన నురుప్ సనన్ నటిస్తుందని చిత్ర యూనిట్ గురువారమే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో భామ పేరును కూడా రివీల్ చేసింది. ఢిల్లీ మోడల్ గాయత్రి భరద్వాజ్ కూడా ఇందులో నటిస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు.

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించబోతున్నాడు. అలాగే, చాలా మంది ప్రముఖులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.

  English summary
  Mass Maharaj Ravi Teja Doing Tiger Nageswara Rao Under Vamsee Direction. Gayatri Bhardwaj Onboard for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X