రష్మిక వల్లే క్రేజ్.. గీతా.. ఛలో ప్రీరిలీజ్ వేడుకలో ప్రముఖులు
గోల్డెన్‌స్టార్ గణేశ్, టాప్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'గీతా... ఛలో'. వీకెంట్ పార్టీ అనేది ట్యాగ్‌లైన్.చిత్రాన్ని శ్రీ రాజేశ్వరి ఫిల్మ్ పతాకంపై డి.దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ సంయుక్తంగా తెలుగులో 'గీతా.. ఛలో' పేరుతో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 26న విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రీ రేలీజ్ వేడుకను కళా భారతి ఆడిటోరియం వైజాగ్ లో ఆదివారం, రాత్రి ఘనంగా నిర్వహించారు.
సనమండలి సభ్యులు MLC శ్రీ దువ్వారపు రామారావు,సినీ నటుడు ప్రసన్నకుమార్, తదితర ప్రముఖులు హాజరై ట్రైలర్ మరియు టీజెర్ ను వీక్షించి, ప్రీ రేలీజ్ పోస్టర్ ను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాభినందనలు తెలిపారు.

తొలుత చిత్ర ట్రైలర్‌ను, పాటలను అతిథులు వీక్షించారు. అనంతరం ప్రీరిలీజ్
పోస్టర్ ను ఆవిష్కరించారు
ఈ సందర్భంగా MLC శ్రీ రామారావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కి ముందు చిన్నారుల నృత్య ప్రదర్శన తరువాత ఈ ఆవిష్కరణ కార్యక్రమం చాలా బాగుందని, సినిమాలు యువతకు ఆదర్శంగా ఉన్నట్లు తీయాలని , 'గీతా.. ఛలో' టైటిల్ కూడా క్యాచీగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా రిచ్‌లుక్ ఉంది. ఇది పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్ రష్మీక ఈ రోజు టాప్ హీరోయిన్, ట్రైలర్ చాలా బాగుందని '' అన్నారు.
సినీనటుడు శ్రీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. రష్మీక గురించి ఎంత చెప్పినా తక్కువే. దివాకర్ గారు మాకు మంచి మిత్రులు, డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్ ఆయన కోసమే ఇక్కడికి వచ్చా. ఈ సినిమా గీతా గోవిందం స్థాయిలో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.ట్రైలర్ మరియు పాటలు చాలా బాగున్నాయి'' అన్నారు.
నిర్మాత మామిడాల శ్రీనివాస మాట్లాడుతూ ఈ సినిమాకి మేము చాలా కష్టపడ్డాం. కన్నడలో ఈ సినిమా రూ. 30 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో ఎమోషన్స్, కామెడీ ఉన్నాయి. ఇది యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా బాగా నచ్చుతుంది. ఈ నెల 26న విడుదల అవుతుంది. అందరూ తప్పక చూడండి.'' అన్నారు.
సమర్పకులు దుగ్గివలస దివాకర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో చేసిన రష్మిక ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిందని ఈ సినిమాలో యూత్‌ను ఆకట్టుకునే అన్ని అంశాలూ ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఇది బాగా నచ్చుతుంది. ఈ సినిమా ఆల్రెడీ జనాలకు రీచ్ అయిందని ఈ ప్రీ రిలీజ్ వేడుకకు విచ్చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత 26న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ తప్పక చూసి ఆదరించాలని కోరుకుంటున్నా.'' అన్నారు.
చిత్ర నిర్మాత దుగ్గివలస శ్రీనివాస్, సహనిర్మాత రత్నమాల తదితరులు పాల్గున్నారు


Click it and Unblock the Notifications











