23న గీత గోవిందం టీజర్ రిలీజ్..
అర్జున్‌రెడ్డి చిత్రం ఓవర్‌నైట్ స్టార్ అయిన విజయ్‌దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం " గీత గోవిందం". బన్నీవాసు నిర్మాణంలో ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం. "గీత గోవిందం తొలి సింగిల్ విడుదలై వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, గీతా గోవిందం చిత్రం టీజర్‌ను 23 జూలై (సోమవారం) ఉదయం11.05 గంటలకు విడుదల చేస్తున్నారు. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బీజీగా ఉన్న ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది. రొమాంటిక్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి మణికందన్ సినిమాటోగ్రఫిని అందించారు. ఆర్ట్ రమణ వంక, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ చక్కటి పనితీరుని చూపించారు. ఇప్పటికే పాజిటివ్ బజ్‌ని సొంతం చేసుకున్నది. క్రేజీ హీరో విజయ్‌దేవర కొండ, హీరోయిన్ రష్మిక జంట చూడముచ్చటగా కనిపిస్తుందనే మాట వినిపిస్తున్నది.

నటీనటులు:
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, నాగబాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, మౌర్యాని, సుభాష్, అభయ్, స్వప్నక, సత్యం రాజేష్, దువ్వాసి మెహన్, గుండు సుదర్శన్, గౌతంరాజు, అనీష, కళ్యాణి నటరాజన్, సంధ్య జనక్ తదితరులు...
సాంకేతిక నిపుణులు..
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీవాసు
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పరుశురామ్
సంగీతం: గోపిసుందర్
సినిమాటోగ్రాఫర్: మణికందన్
ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్
ఆర్ట్: రమణ వంక


Click it and Unblock the Notifications











