‘నా కటౌట్‌కి‌ తాళి కట్టే దమ్ముందా... ఏ మగాడు నా జీవితంలోకి రాడు’

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంత మంది కమెడియన్లు భారతదేశంలో ఏ ఇండస్ట్రీలోనూ ఉండరన్నది అందరికీ తెలిసిందే. పురుషులతో పాటు లేడీ కమెడియన్స్ కూడా బ్లాక్‌ అండ్ వైట్ నుంచి నేటి వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నారు. గిరిజ, రమాప్రభ, శ్రీలక్ష్మీ, కొవై సరళ, పాకీజా, తెలంగాణ శకుంతల, హేమ వంటి కమెడియన్లు తమ నటనతో ఆకట్టుకున్నారు. మేల్ డామినేషన్ స్పష్టంగా కనిపించే సినీరంగంలో వీరంతా తమ ప్రతిభతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఈ కోవలోకే వస్తారు గీతా సింగ్.

దివంగత ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన కితకితలు సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా నటించారు గీతా సింగ్. భారీ పర్సనాలిటీతో, తనదైన కామెడీ టైమింగ్‌తో భర్తను మార్చుకునే భార్యగా ఆకట్టుకున్నారు గీత. అయితే ఈ సినిమా కంటే ముందే జై చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు గీతా సింగ్. కానీ కితకితలుతో బ్రేక్ అందుకున్నారు. ఆ తర్వాత ఎవడిగోల వాడిది, అల్లరి పిడుగు, ప్రేమాభిషేకం, దొంగల బండి, శశిరేఖ పరిణయం, మళ్లీ మళ్లీ, సీమటపాకాయ్, ధూల్, సరైనోడు ఇలా హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను నవ్వించారు. 20 ఏళ్ల కెరీర్‌లో 150కి పైగా సినిమాలలో నటించారు. అయితే గత కొన్నేళ్లుగా గీతా సింగ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా సింగ్ మాట్లాడుతూ.. తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Geeta Singh Emotional Life Story Career Personal Struggles and Marriage

కొత్తగా చేయాలనిపించి మ్యూజిక్ ఆల్బమ్స్ ట్రై చేశా.. నా దెబ్బకి సెట్ మొత్తం గజగజ వణికిపోయింది. నా కొరియోగ్రాఫర్లు స్వరూప్, అనితల వల్లే ఇదంతా. ఒకరోజు కలిశాం.. ఆ వెంటనే ఇది ఫైనల్ చేసేశాం. నాది నార్త్ ఇండియా కానీ ఇప్పుడు తెలుగు అమ్మాయిలా మారిపోయా. తెలుగు బాగానే మాట్లాడగలను. నేను కితకితలు సినిమా చేయడం వల్ల బొద్దుగా ఉన్న అమ్మాయిల్ని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఒక గంట, 5 నిమిషాలు, హాఫ్ డే క్యారెక్టర్లు ఎన్నో చేశాను.. అవన్నీ లెక్కతీస్తే నా సినిమాలు 1000 దాటేస్తాయి. కరోనా వల్ల కొన్ని రిలీజ్ కాలేదు.. కొన్ని మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు కూడా ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. మొన్న ఒక వెబ్‌సిరీస్ చేశా.. పక్కా మాస్.. నోట్లు పాన్ వేసుకుని నటించా. నేను ఏం చేసినా జనాలు యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం ఉందని గీతా సింగ్ అన్నారు.

ఒక తమిళ అమ్మాయిని తీసుకురావడం వల్ల నా కెరీర్‌పై చాలా ఇంపాక్ట్ పడింది. అమ్మాయి తప్పు లేదు.. మనవాళ్లు కోరుకుని తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేయలేం. ఎవరికి రాసిపెట్టి ఉంటే వాళ్లకు వస్తుంది. మీరు ఉండాల్సిన రోల్‌లో ఆ అమ్మాయి చేస్తుందని చాలామంది అడిగారు. మన తెలుగువాళ్లు అందరినీ ఆదరిస్తారు.. ఆ అమ్మాయికి ఓ లైఫ్ ఇద్దామని చెప్పా. నా పర్సనల్ రీజన్స్ వల్లే గ్యాప్ తీసుకున్నా.. మా బాబుని కోల్పోయాక ఈ నిర్ణయం తీసుకున్నా. చాలా ఆఫర్లు వచ్చినా నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. నా ఫాలోవర్స్ చాలామంది కమ్ బ్యాక్ ఇవ్వమని అడుగుతున్నారని గీతా సింగ్ పేర్కొన్నారు.

చీటీలు కట్టి మోసపోవడం వల్ల రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశా. మనల్ని నమ్ముకుని చాలామంది ఉన్నారని అలాంటి ఆలోచనలు విరమించా. అతను అందరికీ కలిపి దాదాపు 15 కోట్ల వరకు ఎగ్గొట్టాడు.. ఇప్పటి లెక్క ప్రకారం చూస్తే అది 50, 60 కోట్లు ఉంటుంది. అన్నయ్యకు బాబు పుట్టగానే వాడిని నాకు ఇచ్చేయమని చెప్పా. ఆ టైంలో నేను చాలా బిజీ, పెళ్లయినా వాడిని నేనే పెంచుకుంటానని అన్నా. బిజీగా ఉండటం వల్ల జీవితంలో లవ్ లేదు, పెళ్లి లేదు.. రోజుకు రెండు షూటింగ్స్‌తో గడిపేసే దానిని. దాంతో పెళ్లి మీదకు మనసు రాలేదు. ఇంతలో పిల్లలు పెద్దగా అయ్యారు. ఎవరైనా ఉంటే లవ్ చేయొచ్చు.. ఎవరూ లేరు కదా? ఎవరినైనా పట్టుకుందామన్నా టైం లేదు. పిల్లల చదువులు, పెంపకం చూసుకుంటూ పెళ్లిని వదిలేశాను. అందరికీ బాధలు ఉంటాయి.. వాటిని బయటకు చెబితే చులకన అయిపోతాం. ధైర్యంగా బతికేస్తా.. మమ్మీ, సిస్టర్, పిల్లలు ఉన్నారు వాళ్లని చూసుకుంటానని గీతాసింగ్ అన్నారు.

బాబు ఫ్రెండ్స్‌తో టూర్‌కి వెళ్లి అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. నాకు మిడ్ నైట్ ఈ వార్త తెలిసింది. బయట ఫ్రెండ్స్‌తో ఆడుకుంటున్నాడు కదా అనుకున్నాం. మోహన్ బాబుగారు, విష్ణుబాబు గారు వాళ్ల కాలేజ్‌లోనే ఫ్రీగా బాబుని చదివించారు. విష్ణుగారు అడగ్గానే క్యాబ్ మాట్లాడి తిరుపతికి పంపించేశా. బీటెక్ పూర్తి జాబ్‌లో జాయిన్ అయ్యాడు.. అంతలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. వార్త తెలిసినా.. ఫోటోలు చూసేవరకు నమ్మలేదు, వాడిని అలా చూసి కిందపడిపోయా. నేను కూడా చనిపోయానని అనుకున్నారు. చిన్నోడు బీటెక్ అయిపోవడంతో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాడు. ఒంటరిగా ఉండటం నేర్చుకున్నా.. అపార్ట్‌మెంట్‌లో చాలామంది ఉన్నారు, వాళ్లతో గడుపుతా.. వీలున్నప్పుడు వాకింగ్ చేస్తా. నా జీవితంలోకి ఒక్కరు కూడా ఎందుకు రాలేదా? అని వెయిటింగ్.. ఎవ్వరూ రాలేదు ఇప్పటి వరకు. ఈ కటౌట్ చూసి భయపడకుండా ఉంటారా? ఎవరు రాలేదు.. ఇకపైన ఏ మగాడు నా జీవితంలోకి రాడు అని గీతా సింగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: geeta singh movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X