ఆడపిల్లలపై నిర్మాతలకు జాలి లేదు.. ఎవ్వరికీ చెప్పుకోలేక పోతున్నా: గీతా సింగ్

తెలుగు సినీ పరిశ్రమలో రోజుకో ఇష్యూ సంచలనం సృష్టిస్తోంది. కాస్టింగ్ కౌచ్ సమస్య మొదలుకొని మహిళలు తమ ఇబ్బందులను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. తాజాగా హాస్యనటి గీతా సింగ్ మీడియా ముందు తన ఆవేదన వెళ్లగక్కింది. హాస్య నటిగా పలు సినిమాల్లో ఆకట్టుకున్న ఆమె 'కితకితలు' సినిమాలో అల్లరి నరేష్ సరసన నటించి మంచి ఫేం అందుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో హాస్యనటిగా మెప్పించింది. కాగా గీతా సింగ్ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట.

''ఎన్నో సినిమాల్లో నటించాను.. చిన్న రోల్స్ మొదలుకొని పెద్దవి దాకా చేశా. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా రాకపోయినా సమస్యే. కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా మా లాంటి నటులకు నిర్మాతలు డబ్బులు ఇస్తారనే గ్యారెంటీ లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో, ఈవెంట్లలో పాల్గొన్నందుకు రావాల్సిన డబ్బులు కూడా రాలేదు. వాటిని అడిగి వసూలు చేసుకునే ధైర్యమూ లేదు'' అని ఆవేదన చెందింది గీతా సింగ్.

Geeta Singh Sensetional Comments On Tollywood Producers

ఒక ఆడపిల్ల ఇలా ఇబ్బందులు పడుతోందన్న జాలి కూడా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేదు. ఈ సిచువేషన్ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి.. చెప్పినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కొంతమంది తెలిసిన నిర్మాతల వద్ద గోడు వెళ్లబుచ్చుకొని అవకాశాలు ఇవ్వమన్నా ఇవ్వలేని పరిస్థితి. ప్రస్తుతం ఉన్న కొత్త దర్శకులు మా లాంటి నటీనటులను పక్కన పెట్టేశారని చెప్పింది గీతా సింగ్. గతంలో చాలా సినిమాల్లో కనిపించి అలరించిన గీతా సింగ్ ఈ మధ్య కాలంలో అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దర్శకనిర్మాతలపై గీతా సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఫిలింనగర్‌లో చర్చనీయాంశంగా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X