విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ మరో రికార్డ్...
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' మరో రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం 59 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతోంది.
మామూలు మధ్యస్థాయి సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం నమోదు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. గీతాఆర్ట్స్ 2 బేనర్లో బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

అప్పటికే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' చిత్రంతో వంద కోట్లు వసూలు చేసే సత్తా ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
టాలీవుడ్ చరిత్రలోనే ఈ మూవీ సంచలన విజయం అందుకుంది. కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 125 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో నాగబాబు, సుబ్బరాజు, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా విడుదల ముందే కొన్ని సీన్లు లీక్ కావడం నిర్మాతలను కాస్త కంగారు పెట్టినా... వసూళ్లపై ఆ ఎపెక్ట్ పడక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కాగా... విజయ్ దేవరకొండ ఈ నెల 5న 'నోటా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కాబోతోంది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











