గీత గోవిందం దర్శకుడు మళ్ళీ మెగా బ్యానర్‌లోనే!
గీత గోవిందం చిత్రంతో పరశురామ్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. ఈ ఏడాది విడుదలైన గీత గోవిందం చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. విజయ్, దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం స్టార్ హీరోల సినిమాల తరహాలో 70 కోట్ల షేర్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. అంతకు ముందుకు పరశురామ్ తెరకెక్కించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే తెరకెక్కింది.
ప్రస్తుతం పరశురామ్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో హ్యాట్రిక్ చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పరశురామ్ తదుపరి తెరకెక్కించబోయే చిత్రానికి కథ సిద్ధం చేశారట. గీత ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారో తెలియాల్సి ఉంది.

మరోవైపు పరశురామ్ మైత్రి మూవీస్ వారితో కూడా ఓ చిత్రానికి కమిటై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలలో ఏది ముందుగా ప్రారంభం అవుతుందో తెలియాల్సి ఉంది. రొమాంటిక్ కథలతో మ్యాజిక్ చేయడం పరశురామ్ ప్రత్యేకత. ఈ సారి పరశురామ్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











