గీతగోవిందం టీజర్ రేపటికి వాయిదా.. దిల్ వల్లే అంటూ వెరైటీగా పోస్టర్‌లో!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించే సినిమాలపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. అర్జున్ రెడ్డి చిత్రం తరువాత విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గీతగోవిందం. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్ర టీజర్ నేడు విడుదల కావలసి ఉంది. కానీ రేపటికి వాయిదా పడింది. హీరో నితిన్ నటిస్తున్న శ్రీనివాస కళ్యాణం చిత్ర టీజర్ కూడా నేడు విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు గీత గోవిందం చిత్ర యూనిట్ కి ఫోన్ చేసి టీజర్ విడుదల రేపటికి వాయిదా వేసుకోవాలని రిక్వస్ట్ చేశారట. అందువలనే టీజర్ విడుదల రేపటికి పోస్ట్ పోన్ అయింది.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వైరైటీగా తెలియజేసింది. గీత గోవిందం చిత్ర పోస్టర్ లో దిల్ రాజు ఫోన్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ పోస్టర్ నెటిజన్లని ఆకట్టుకుంటోంది.
vijay devarakonda geetha govindam srinivasa kalyanam nithin dil raju విజయ్ దేవరకొండ గీత గోవిందం శ్రీనివాస కళ్యాణం


Click it and Unblock the Notifications