డబ్బుతో హీరోయిన్లను అలా లొంగదీసుకుని.. హీరో బాగోతం బయటపెట్టిన టాప్ డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. హీరోగానే నటించాలని అనుకోకుండ తన మనసుకు నచ్చిన అన్ని రకాల పాత్రలు వేస్తూ అలరిస్తున్నారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా ఏ పాత్ర చేయటానికైనా సిద్ధంగా ఉంటారు విజయ్. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తున్నారు. అలాంటి విజయ్ సేతుపతిపై ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు రావడం చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది.
నా ఫ్రెండ్‌ని వాడుకుంటున్నాడు
కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ తారాస్థాయిలో ఉందని.. దీని కారణంగా తన స్నేహితురాలు ఎంతో క్షోభను అనుభవించిందని రమ్య అనే మహిళ ట్విట్టర్‌లో వరుస పోస్ట్‌లు పెట్టింది. ఆమెను బలవంతంగా ఇండస్ట్రీలోకి లాగారని.. ప్రస్తుతం ఆమె రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స తీసుకుంటోందని రమ్య మోహన్ ఆరోపణలు చేశారు. హీరో విజయ్ సేతుపతి క్యారవాన్‌లో ఫేవర్ చేస్తే 2 లక్షల రూపాయలు.. లాంగ్ డ్రైవ్ కోసం 50 వేల రూపాయలను ఆఫర్ చేస్తాడని రమ్య ఆరోపించారు. విజయ్ పైకి చూడటానికి ఓ యోగిలా నటిస్తాడని.. నా ఫ్రెండ్‌ని ఆయన కొన్నేళ్లుగా వాడుకుంటున్నాడని మండిపడింది.

పబ్లిసిటీ కోసమే నాపై ఆరోపణలు
దీనిపై విజయ్ సేతుపతి అభిమానులు భగ్గుమనడంతో తన ట్వీట్లను రమ్య తొలగించారు. బ్రిటన్‌లో డాక్టర్‌గా ఉన్న రమ్యకు ఈ విషయాలు ఎలా తెలిశాయి? విజయ్ సేతుపతి మంచోడు కాదా? తమిళ చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతోంది? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. దీంతో విజయ్ సేతుపతి స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో తన కుటుంబం ఎంతో బాధపడిందని .. రమ్యపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నేనెంటో నాకు తెలుసునని, తప్పుడు ఆరోపణలతో నా కుటుంబం, సన్నిహితులు బాధపడ్డారని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం ఆమె ఇలా చేస్తోందని.. కొద్దినిమిషాలు ఆమెను హైలైట్ కానివ్వండి, ఎంజాయ్ చేయనీయండి అంటూ విజయ్ సేతుపతి వ్యాఖ్యానించారు.
రెండు మూడు సినిమాలకే ఎక్కేసింది
తాజాగా విజయ్ సేతుపతిపై వచ్చిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నల్లగా ఉండేవారిని తమిళయన్స్ బాగా ఆదరిస్తారు, దానికి అతని నటన ప్లస్ కావడంతో క్లిక్ అయ్యాడు. ఒకటి రెండు సినిమాలతో పెద్దోడు అయిపోవడంతో వాళ్లకి క్యారవాన్‌లు, సెపరేట్ ఫ్లైట్ లెవల్‌లు మీరంతా చూస్తున్నారు. ఓ సినిమా కోసం విజయ్ సేతుపతిని సంప్రదించి 10 రోజులు డేట్స్ అడిగా. చిన్న క్యారెక్టర్లు నేను చేయను, పక్కా సినిమా అంతా నా మీద ఉంటేనే చేస్తానని చెప్పాడు. షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ సినిమాలు చేసి ఒక్కసారిగా పైకి రావడంతో బాగా ఎక్కేసింది' అని గీతాకృష్ణ మండిపడ్డారు.
డబ్బు మదంతో ఈ పనులు
'సడెన్‌గా వచ్చిన డబ్బును విజయ్ సేతుపతి దుర్వినియోగం చేస్తున్నాడు. నాకన్నా 15 ఏళ్లు చిన్నపిల్లని హీరోయిన్‌గా పెడితే నటించనని అన్నాడు. చిన్న పిల్లతో చేస్తే తప్పేంటీ? ఒప్పేంటీ? చెప్పేవి శ్రీరంగనీతులు.. దూరేవి అన్నట్లుగా విజయ్ సేతుపతిని తమిళ జనాలు విపరీతంగా మోసేశారు. కారవాన్‌లోకి హీరోయిన్ కానీ, హీరోయిన్‌తో పాటు యాక్ట్ చేసే ఏ అందమైన అమ్మాయి వచ్చినా 2 లక్షలు, రూమ్‌కి వస్తే మరో రేటు. ఇలా రేట్లు పెట్టేసి ఎవరికీ తెలియదు అనుకుంటున్నాడు. విజయ్ సేతుపతి పెద్ద హిపోక్రటిక్.. సినిమా ఇస్తానని అమ్మాయిలకి ప్రామీస్ చేయడు, ముందు క్యారవాన్ ఎక్కించి వాడుకుంటున్నాడు. సడెన్‌గా డబ్బులు వచ్చేశాయి.. ఒక్కో సినిమాకు 20 కోట్లు, 40 కోట్లు వస్తే ఏం చేస్తాడు' అంటూ విజయ్ సేతుపతిపై గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











