Fake News Fight: విజయ్ దేవరకొండ పోరాటంపై గీతా మాధురి రియాక్షన్

ఫేక్ న్యూస్ లపై ప్రస్తుతం ఇండస్ట్రీలో సినీ తారలు ఏ విదంగా స్పందిస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మినీ స్టార్స్ నుంచి బిగ్ స్టార్స్ వరకు అందరూ ఒక్కసారిగా వారి ఐక్యతను తెలియజేస్తున్నారు. విజయ్ దేవరకొండ కంటే ముందే చాలా మంది స్టార్స్ ఈ ఫేక్ న్యూస్ లపై స్పందించారు. రీసెంట్ గా గీతా మాధురి ఈ విషయంపై తన వివరణ ఇచ్చారు.

విజయ్ దేవరకొండ పిలుపుతో..

విజయ్ దేవరకొండ పిలుపుతో..

మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో విజయ్ దేవరకొండ లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక వెబ్ మీడియా తాను చేస్తున్న సహాయాన్ని తప్పుగా ప్రచారం చేస్తోందని విజయ్ వివరణ ఇచ్చాడు. గాసిప్స్, ఫేక్ న్యూస్ అంటూ ప్రచారం చేసే వెబ్ సైట్ లను బ్యాన్ చేయాలని విజయ్ దేవరకొండ పిలుపునివ్వగా స్టార్ సెలబ్రెటీస్ అంతా స్పందించారు.

 గీత మాధురి కామెంట్స్..

గీత మాధురి కామెంట్స్..

విజయ్ దేవరకొండ కంటే ముందే తాము చాలా సార్లు ఈ ఫేక్ న్యూస్ లపై స్పందించామని అయితే అప్పుడు తమని ఎవరు పట్టించికోలేదని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతమధురి కామెంట్ చేశారు. భర్త నందుతో కలిసి ఆమె ఒక మీడియా ఛానెల్ తో ముచ్చటించారు. అయితే అందులో ఈ ఫేక్ న్యూస్ లపై కూడా వారు వివరణ ఇచ్చారు..

యూ ట్యూబ్ థంబ్ నైల్స్.. మరీ దారుణం..

యూ ట్యూబ్ థంబ్ నైల్స్.. మరీ దారుణం..

చాలా సార్లు ఈ ఫేక్ న్యూస్ ల వల్ల మేము కూడా ఇబ్బంది పడ్డాం.. యూ ట్యూబ్ థంబ్ నైల్స్ అయితే మరీ దారుణం. గతంలోనే ఈ గాసిప్స్, అబద్ధపు వార్తలపై మేము స్పందించాము. కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో ఆ ఫేక్ న్యూస్ లపై పోరాటం చేయడంతో స్టార్స్ సెలబ్రెటీస్ అంతా స్పందిస్తున్నారు. నిజంగా ఇది సంతోషించదగ్గ అంశం అని గీత మాధురి తెలిపారు.

Recommended Video

NTR Calling Allu Arjun 'Baava' || Tweet Goes Viral
 అనసూయ కౌంటర్..

అనసూయ కౌంటర్..

ఫేక్ వార్తలపై విజయ్ స్పందించిన తీరుకు స్టార్ సెలబ్రెటీస్ అంతా వారి మద్దతు అందిస్తుండగా యాంకర్ అనసూయ మాత్రం ఎవరు ఊహించని విధంగా రెస్పాండ్ అయ్యింది. మన వరకు వచ్చే వరకు ఆ బాధ ఏంటో తెలియదా? అని ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇవ్వడం వైరల్ అయ్యింది. అలాగే కొంతమంది నెటీజన్స్ కూడా ఆమెపై ట్రోల్ చేశారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X