‘నా కళ్ల ముందే అలాంటి పనులు... నోరు తెరిస్తే వాళ్ల కాపురాలు కూలిపోతాయ్’
టాలీవుడ్‌లో ఉన్న స్టార్ సింగర్స్‌లో గీతా మాధురి కూడా ఒకరు. తన గొంతుతో ఎన్నో హిట్ పాటలను పాడి ప్రేక్షకులను అలరించారు గీత. సింగింగ్‌తో పాటు కంపోజింగ్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ గీత రాణిస్తున్నారు. ఇండస్ట్రీలోకి ఎంతో మంది సింగర్స్ వచ్చినా.. గీతా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గీతా మాధురి కుటుంబం ఆమె తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడింది. చదువు తర్వాత తొలుత ప్రేమలేఖ రాశా అనే సినిమాలో గాయనీగా అవకాశం అందుకుని తొలి పాట పాడారు గీతా మాధురి. అయితే 2007లో రామ్ చరణ్ తేజ్ నటించిన చిరుత చిత్రంలోని చమ్కా చమ్కా సాంగ్ ఆమెకు స్టార్ డమ్ తీసుకొచ్చింది. ఈ పాట తర్వాత గీతా మాధురి వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత మగధీరలో ధీర ధీర, గోలీమార్‌లోని మగాళ్లు ఒట్టి మాయగాళ్లు అనే పాటలతో గీత పేరు టాలీవుడ్‌లో మారుమోగింది.

20 ఏళ్లకు పైగా కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 2300కు పైగా పాటలు పాడారు గీతా మాధురి. నంది అవార్డ్స్‌తో పాటు పురస్కారాలు ఆమెను వరించాయి. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ఫిమేల్ సింగర్‌గా.. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ పొందే సింగర్‌గానూ నిలిచారు. యువ నటుడు నందూతో ప్రేమలో పడిన గీతా మాధురి పెద్దల అంగీకారంతో 2014లో ఆయనను పెళ్లి చేసుకుని హ్యాపీగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరికి 2019లో ఓ పాప పుట్టింది.
నందూ సినిమాల్లో రాణిస్తుండగా.. గీతా మాధురి సింగింగ్‌తో పాటు టెలివిజన్, ఓటీటీలోని పలు రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి రన్నరప్‌గా నిలిచారు. వివాదాలకు, వివాదాస్పద అంశాలకు గీతా మాధురి తొలి నుంచి దూరంగా ఉండేవారు. అయితే ఇటీవల సింగర్ నోయెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మగాళ్లు ఉట్టి మాయగాళ్లు అని నువ్వే అన్నావు.. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని నువ్వే అంటున్నావు? మేం ఏం అర్ధం చేసుకోవాలని నోయెల్ ప్రశ్నించగా గీతా నవ్వేసింది. అదే నా ప్రాబ్లమ్.. సైడ్ ట్రాక్స్‌తోనే. పెళ్లి ఒక స్ట్రెస్, పిల్లలు ఒక స్ట్రెస్, పండగొస్తే అలా చేయలేదు ఏంటని స్ట్రేస్, పండగొస్తే ఇలా చేశానేంటీ అని అదొక స్ట్రెస్. నువ్వు అందంగా ఉన్నావని రోజూ నందూ నాకు చెప్పడు. నువ్వు భలే ఉన్నావని నేను కూడా చెప్పను. కానీ అదే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెడితే కింద కామెంట్స్ వస్తాయి నువ్వు బాగున్నావని.. సోషల్ వాలిడేషన్ కోసం ట్రై చేసే ప్రాసెస్‌లో నాకు నువ్వు లేకపోయినా పర్లేదు పో అంటుంటానని చెప్పింది గీత.
అనంతరం రిలేషన్‌షిప్ గురించి నోయెల్ ఒక ప్రశ్న అడగ్గా.. ఒక ప్రేమ జంట ఉన్నారనుకో. నేను ఏదో ఒకరోజే కాఫీ షాప్‌కి వెళ్తా. ఆరోజే ఆ ప్రేమ జంట అక్కడికి వస్తారు. అలా నాకు దొరికిపోతారు అందరూ. చాలామంది దొరుకుతూనే ఉంటారు.. నేను నోరు తెరిస్తే కాపురాలే కూలిపోతాయ్ అని గీతా మాధురి బాంబు పేల్చింది. సోషల్ మీడియాలో నీకు అన్ని తెలుసు.. కామెంట్స్ ఏం రాబోతున్నాయో కూడా నువ్వు ఊహించగలవు. నీది సూపర్ క్వాలిటీ అని నోయెల్ ప్రశంసించాడు. ప్రస్తుతం గీతా మాధురి వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ఆమెకు దొరికిపోయిన జంటలు ఎవరు? సెలబ్రిటీ జంటలా? లేకపోతే గీతా సన్నిహితులా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ రావాల్సిందే.


Click it and Unblock the Notifications