For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘గంధర్వ’గా జార్జిరెడ్డి సందీప్ మాధవ్.. సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా!

  |

  వంగవీటి, జార్జిరెడ్డి చిత్రాలతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతుడైన నటుడు సందీప్ మాధవ్ హీరోగా రూపొందుతున్న చిత్రం గంధర్వ. గాయత్రి ఆర్ సురేష్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యస్ అండ్ యమ్ క్రియేషన్స్, వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై అప్సర్ దర్శకత్వంలో యం యన్ మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం డిసెంబర్ 27న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా ప్రారంభం అయింది. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, క్రిష్, హీరో శ్రీకాంత్, సాయికుమార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

   George Reddy fame Sandeep Madhavs Gandharwa launched by VV Vinayak.

  పూజా కార్యక్రమాల అనంతరం హీరో సందీప్ మాధవ్, హీరోయిన్ అక్షత శ్రీనివాస్ పై చిత్రికరించిన ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా శ్రీకాంత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటైన మీడియా సమావేశంలో హీరో సందీప్ మాధవ్, హీరోయిన్ అక్షత శ్రీనివాస్, దర్శకుడు అప్సర్, ప్రముఖ నటులు సురేష్, బాబుమోహన్, ఆదర్శ్, కెమెరామెన్ జవహర్ రెడ్డి, సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్, వీరశంకర్, నిర్మాత యం. యన్. మధు పాల్గొన్నారు..

   George Reddy fame Sandeep Madhavs Gandharwa launched by VV Vinayak.

  వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ అధినేత వీరశంకర్ మాట్లాడుతూ... మంచి సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్ అప్సర్. ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ గంధర్వ అనే అద్భుతమైన కథని రెడీ చేశాడు. కొత్తగా మంచి సినిమా తియ్యాలన్న కసి, ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్. ఈ మధ్యకాలంలో ఇలాంటి కొత్త కథ వినలేదు. తప్పుకుండా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్‌తో ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ కావడం జరిగింది అని తెలిపారు.

  నిర్మాత యం.యన్. మధు మాట్లాడుతూ.. మా బ్యానర్లో ఇది రెండో చిత్రం. దర్శకుడు అఫ్సర్ గంధర్వ స్టోరీ చెప్పగానే వెంటనే నచ్చేసింది. ఈ కథకి శాండీ ఫర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యారు. ఇందులో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాను. 28 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. మేలో గంధర్వ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.

   George Reddy fame Sandeep Madhavs Gandharwa launched by VV Vinayak.

  హీరో సందీప్ మాధవ్ (శాండీ) మాట్లాడుతూ.. జార్జిరెడ్డి తర్వాత చాలా కథలు విన్నాను. అన్నీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ లో ఉన్నాయి. కొత్తగా ఎదైనా చెయ్యాలని వైయిట్ చేస్తున్న నాకు అప్సర్ కథ చెప్పగానే ఈ మూవీలో నేనుకూడా ఉంటే బాగుండు అనిపించి వెంటనే ఒకే చెప్పా. తెలుగు సినిమా ఫార్మాట్ ఓ కొత్త యాంగిల్ ని పరిచయం చేస్తున్నారు. సాయికుమార్, సురేష్, బాబుమోహన్ లాంటి సీనియర్ యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. వీరశంకర్, మధు గారితో ట్రావెల్ చేయడం బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ఆడియెన్స్ కి కలుగుతుంది.. అన్నారు.

  చిత్ర దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. ఏదైనా ఒక సినిమా చేయాలన్న కసితో వీరశంకర్ గారికి చాలా కథలు చెప్పాను. ఆయన ఎప్పుడూ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి నీకు అని చెప్పారు. 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన పెంచుకొని చాలా రోజులు వెయిట్ చేశాను. కొత్త కాన్సెప్ట్ తో మంచి కథ రెడీ చేసి వీరశంకర్ గారికి చెప్పాను. ఆయన వెంటనే ఫెంటాస్టిక్ గా ఉంది అని ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. గంధర్వ అంటే నిత్య యవ్వనంలా ఉండటం అని అర్థం. హిలేరియస్ ఇంటెన్సిటీ ఉంటుంది. సాయికుమార్, సురేష్, బాబుమోహన్, ఆదర్శ్ ఇంకా ఒక ముప్పై మంది నటిస్తున్నారు. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. మే 21న ఈ సినిమాని రిలీజ్ చేయాలని మా నిర్మాతలు ప్లాన్ చేశారు అని అన్నారు.

  నటీనటులు: సందీప్ మాధవ్, గాయత్రి ఆర్.సురేష్, అక్షత శ్రీనివాస్, సాయికుమార్, సురేష్, పోసాని, బాబుమోహన్, సన, ఆదర్శ్ పసుపులేటి, తాగుబోతు రమేష్, మధు నారాయణ్, జయరాం, టీఎన్ఆర్, సత్య శ్రీ, ఆటో రాంప్రసాద్, ఆర్జీవి రాము, పింగ్ పాంగ్ సూర్య తదితరులు
  డివోపి; జవహర్ రెడ్డి
  మ్యూజిక్: రాప్ రాక్ షకీల్
  ఎడిటర్: బస్వా పైడిరెడ్డి
  ఆర్ట్; విజయ్ కృష్ణ
  పిఆరోఓ; సాయి సతీష్
  కో-డైరెక్టర్; ప్రకాష్ పచ్ఛల,
  ప్రొడక్షన్ కంట్రోలర్: జె.రామారావు
  లైన్ ప్రొడ్యూసర్: పాతూరి శ్రీకాంత్ రెడ్డి
  స్క్రీన్-ప్లే; వీరశంకర్
  దర్శకత్వం; అప్సర్
  నిర్మాత; యమ్ యన్. మధు

  English summary
  George Reddy fame Sandeep Madhav's Gandharwa launched by VV Vinayak. Versatile actor SandeepMadhav 's new film Gandharwa Launched today Clap by VVVinayak , camera switch on by actorsrikanth , 1st shot direction by DirKrish.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X