ఓయూ స్టూడెంట్ లీడర్ ‘జార్జి రెడ్డి’ బయోపిక్ ఫస్ట్ లుక్

విద్యార్థి పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీలో ఒకప్పుడు విప్లవవాద ఉద్యమాలను ముందుండి నడిపించి, చివరకు అదే యూనివర్శిటీలో దారుణంగా హత్యచేయబడ్డ విద్యార్థినాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'జార్జి రెడ్డి'.

గతంలో 'దళం' అనే సినిమాను తెరకెక్కించిన జీవన్ రెడ్డి 'జార్జ్ రెడ్డి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైక్ మూవీస్, 3 లైన్స్ మూవీస్, సిల్లీ మంక్స్ స్టూడియోపై అప్పిరెడ్డి, దాము రెడ్డి, సుధాకర్ యక్కంటి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

1962 నుంచి 1972 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన స్టూడెంట్ ఉద్యమాల నేపథ్యంలో 'జార్జ్ రెడ్డి' బయోపిక్ ఉంటుందని తెలుస్తోంది. ఉస్మానియాలో ఉన్న సమయంలోనే ఉద్యమాల వైపు ఆకర్షితుడైన జార్జ్ రెడ్డి అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పి.డి.యస్.యు) స్థాపించారు. పి.డి.యస్.యు భారతీయ కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్) విద్యార్థి విభాగం.

George Reddy Movie First Look

1972 జూలై 14 సాయంత్రం ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న జార్జిపై 30 మందికి పైగా దుండగలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మెట్లపై దాడిచేసి కత్తులతో పొడిచి చంపేశారు. జార్డ్ రెడ్డి బయోపిక్‌లో ఈ విషయాలన్నీ ఉంటాయని తెలుస్తోంది.

జార్ రెడ్డి పాత్రలో సందీప్ మాధవ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా మనోజ్ నందన్, దేవిక, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహతి, సత్యదేవ్ నటిస్తున్నారు. మరాఠీ హిట్ మూవీ 'సైరాట్' చిత్రానికి పని చేసిన సుధాకర్ రెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X