వైరల్‌గా మారిన జార్జ్ రెడ్డి.. ప్రత్యేక ప్రదర్శన వేసిన చిత్రబృందం
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, శత్రువుల మూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరుడి జీవిత చరిత్ర ఆధారంగా జార్జ్ రెడ్డి తెరకెక్కుతోంది. నాటి సామాజిక పరిస్థితులపై, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం పాటు పడిన ఉద్యమ నాయకుడిని దారుణంగా హత్య చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఉస్మానియా క్యాంపస్ రాజకీయాల్లో బలైన వీరుడు కథను నేటి తరానికి పరిచయం చేసేందుకు వస్తోంది జార్జ్ రెడ్డి.
జార్జ్ రెడ్డిని తెరకెక్కిస్తున్న సమయంలో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేయకపోయినా.. ట్రైలర్ విడుదలైన క్షణం నుంచి ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. సాధారణ ప్రేక్షకుల నుంచి సెలెబ్రిటీల దాకా అందరూ జార్జ్ రెడ్డి ట్రైలర్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. మెగా బ్రదర్ నాగ బాబు మరో అడుగు ముందుకేసి తన యూ ట్యూబ్ చానెల్ ద్వారా జార్జ్ రెడ్డి, మూవీ ట్రైలర్ గురించి ఓ పది నిమిషాలు ప్రసంగించాడు.

బయోపిక్ అంటే ఇది.. ఇలాంటి మహనీయుడు కథను తెరకెక్కిస్తే వాటిని బయోపిక్ అంటారని, ప్రతీ ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని సలహాఇచ్చాడు. ఇంతలా అందర్నీ ఆకట్టుకుంటోన్న జార్జ్ రెడ్డి చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో సినిమా విడుదలయ్యే ఒక్క రోజు ముందు ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 21 హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని చూడాలనుకునే వారు టికెట్స్ బుక్ చేసుకోవాలని చిత్రబృందం పేర్కొంది. ఈ నెల 17న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు.


Click it and Unblock the Notifications











