twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యంగ్ హీరో నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం.. ఏం చేశాడో తెలుసా..?

    |

    దేశంలో ఎంతోమంది సెలెబ్రిటీలు మరెంతో మంది వ్యాపార వేత్తలు ఉన్నారు. కానీ అందరిలో కొందరే ప్రత్యేకంగా నిలుస్తారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా కాకుండా, తాము సంపాదించిన ఆ డబ్బును పదిమంది బాగోగుల కోసం ఉపయోగించే వారే పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. ఈ కోవలోనే సెలెబ్రిటీ హోదాలో ఉంటూ సమాజానికి తమ వంతు సహకారం అందించే వారిలో లారెన్స్ సహా చాలామంది ఉన్నారు. తాజాగా అదే జాబితాలో యంగ్ హీరో నిఖిల్ చేరాడు.

    మంచి మనస్సుతో జనాలకు సేవ చేసే విషయంలో నిఖిల్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బాల్యంలో విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన నిఖిల్.. పేద విద్యార్థుల చదువు కోసం ముందుకు వచ్చాడు. ఎవరైతే ఆర్ధిక స్థోమత లేక చదువుకోలేక పోతున్నారో వారికి సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు నిఖిల్. ఈ మేరకు భీమవరంకు చెందిన 300 మంది చిన్నాల చదువుకు అయ్యే పూర్తి ఖర్చు తానే భరిస్తానని ప్రకటించాడు. ''భీమవరానికి చెందిన ఈ 300 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లడం నుంచి మొదలుకొని చదువు పూర్తయ్యే వరకూ అన్నిబాధ్యతలు చూసుకుంటా. ఈ గొప్ప పనిలో నాకు భాగస్వామ్యం కల్పించిన మహేందర్‌, రాంబాబుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో మరికొందరు చిన్నారుల అభివృద్ధికి తోడ్పతా'' అని పేర్కొంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. ఈ మేరకు పాఠశాల విద్యార్థులతో కలిసి దిగిన పిక్ షేర్ చేశాడు. ఇది చూసిన జనం నిఖిల్ పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

    Gets Lot Of Appreciations For Nikhil Siddharth Decision

    ఇక నిఖిల్ సినిమాలంటారా..! నిఖిల్ హీరోగా టీఎన్‌ సంతోష్‌ దర్శకత్వంలో 'అర్జున్‌ సురవరం' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నిఖిల్ నటించాడు. ఇప్పటికే ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. మరికొద్ది రోజుల్లో చందు మొండేటి దర్శకత్వం తెరకెక్కనున్న కార్తికేయ 2లో నిఖిల్‌ నటించబోతున్నారు. దీనికి వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది.

    English summary
    Young hero Nikhil Siddharth decides to 300 Little Kids in Bheemavaram...Everything they need from Start to Finish to Study Will be taken care of..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X