Ghaati Trailer Review: ఘాటీ మూవీ ట్రైలర్ రివ్యూ

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన ఘాటీ చిత్రం విడుదలకు సిద్దమవుతున్నది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు, జాన్ విజయ్, విజయ్ జిషు సేన్ గుప్తా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమకు సాగర్ నాగవెళ్లి సంగీతం అందించారు.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..

Ghaati Trailer Review

అనుష్క శెట్టి కోసం, ఘాటీ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పిస్తున్నది. ఈ చిత్రానికి కాటసాని మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫిని అందించారు. తోట తరణి ఆర్ట్, చింతకింది శ్రీనివాస్ రావు కథను అందించారు. వెంకటస్వామి నక్కా, చాణక్య రెడ్డి తురుగు ఎడిటర్‌గా, రాజు సుందరం కోరియోగ్రాఫిని అందించారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా ట్రైలర్‌‌పై మీరు ఓ లుక్కేయండి.

ఘాటీ అంటే.. బ్రిటీష్ కాలంలో రక్తాన్ని చిందించి రోడ్డు మార్గాలు వేసే వారు. కానీ ఘాటీలు ప్రస్తుతం గంజాయిని మోసే గాడిదలుగా మారారు అంటూ ఈ సినిమా కథ ఏమిటో ట్రైలర్‌లో హింట్ ఇచ్చేశారు. ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతంలో జరిగే గంజాయి మాఫియాపై చేసే పోరాటాన్ని ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నాన్ని దర్శకుడు క్రిష్ ఎత్తుకొన్నాడనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమాలోని ఇంటెన్సిటీ ఎలా ఉంటుందనే విషయాన్ని ట్రైలర్‌లో శాంపిల్‌గా రుచి చూపించి అంచనాలు పెంచేశారు.

ఇక కొద్ది నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క శెట్టి ఆగమనం కోసం ఆమె అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో ఆమ కనిపించారు. లంక దహనం చేసే సీతమ్మలా కనిపించారు అంటూ ఆమె ఉగ్ర రూపాన్ని డైలాగ్స్‌తో జస్టిఫికేషన్ ఇచ్చేశారు. దాంతో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లేలా చేశారు. ఈ చిత్రంలోని డైలాగ్స్ ఆలోచింప జేసే విధంగా ఉన్నాయి. రూరల్ డ్రామా, ట్రైబల్ టచ్ ఉన్న ఈ సినిమాలో ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశారనే విషయం ట్రైలర్‌లో స్పష్టమైంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ఎలాంటి థియేటర్‌లో హల్‌చల్ చేస్తుందనే విషయంపై ఆసక్తి పెరిగింది.

More from Filmibeat

Read more about: ghaati anushka shetty tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X