వివాదంలో ఘంటసాల బయోపిక్.. దర్శకుడికి లీగల్ నోటీసులు?
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటశాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఘంటసాల బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గాయకులు కృష్ణ చైతన్య, ఆయన భార్య మృదుల నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త మీడియాలో వెలుగు చూసింది. వీరిద్దరూ ఘంటసాల దంపతులు కనిపించనున్నారని కథనంలో పేర్కొన్నారు.
తాజా సమాచారం ప్రకారం దర్శకుడు సీఎహెచ్ రామారావుకు ఘంటసాల కుటుంబ సభ్యులు లీగల్ నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

గతంలో ఘంటసాల కుటుంబ సభ్యులను కలిసి దర్శకుడు అనుమతి ఇవ్వాలని కోరగా అందుకు వారు నిరాకరించారు. ఘంటసాల జీవితం మచ్చ లేకుండా ఉంది. అలాంటి మహనీయుడి చరిత్రను సినిమాగా తీసి వివాదంగా మలచడం నాకు ఇష్టం లేదు అని వారు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
అయితే కుటుంబ సభ్యులు నిర్ణయాన్ని పక్కన పెట్టి దర్శకుడు బయోపిక్‌ను ముందుకు తీసుకుపోతున్నారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు దర్శకుడికి లీగల్ నోటీసులు పంపాలని నిర్ణయం తీసుకొన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











