RIP Legend: మహేష్ బాబుకు వరుస విషాదాలు.. ఒకేసారి ఆత్మీయులను కోల్పోయిన సూపర్‌స్టార్

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఘట్టమనేని కృష్ణ అంటే తెలుగు ప్రేక్షకులకు అమితమైన గౌరవం. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ లో ఆయన వారసుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఘట్టమనేని ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడం మహేష్ బాబుకు తీరని బాధను కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో మహేష్ ఎక్కువ స్థాయిలో ఆత్మీయులను కోల్పోవాల్సి వచ్చింది. ఎంతో సున్నితంగా ఉండే మహేష్ ఇలాంటి కఠినమైన సమయాలను ఎదుర్కోవడం అభిమానులను కూడా కలవరపెడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అండగా నిలిచిన తండ్రి లేకపోవడంతో..

అండగా నిలిచిన తండ్రి లేకపోవడంతో..

మహేష్ బాబు తండ్రి ఘట్టమనేని కృష్ణ మంగళవారం ఉదయం నాలుగు గంటలకు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషాదం గురించి తెలుసుకోగానే మహేష్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. తనకు ఈ స్థానం వచ్చింది అంటే కేవలం తండ్రి వల్లే అంటూ తరచుగా మహేష్ చెప్పుకుంటూ ఉంటారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను అని సంతోషంగా చెబుతూ ఉండేవారు. ఇక ఇప్పుడు తనకు అండగా నిలిచిన తండ్రి లేకపోవడంతో మహేష్ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాడు.

అన్నయ్య కూడా ఇదే ఏడాది

అన్నయ్య కూడా ఇదే ఏడాది

మహేష్ బాబు ఇదే ఏడాది తన సోదరుడు రమేష్ బాబు ని కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. పలు అనారోగ్య సమస్యలతో బాధపడిన రమేష్ బాబు ఈ ఏడాది జనవరి 8వ తేదీన హాస్పిటల్ లో మృతి చెందారు. అన్నయ్యతో కూడా మహేష్ బాబుకు ఎంతో అనుబంధం ఉంది. తండ్రి సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు చిన్నప్పుడు రమేష్ బాబు మరో తండ్రిలా మారి మహేష్ బాబును అలాగే తన సోదరీమణులను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. అతను మృతి చెందడం కూడా మహేష్ బాబుకు తీరని లోటు అని చెప్పాలి.

నెల క్రితమే తల్లి మరణం

నెల క్రితమే తల్లి మరణం

ఇక మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇదే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. తల్లి మరణం కూడా మహేష్ బాబుకు తీరని లోటును కలిగించింది. మహేష్ బాబు తల్లి మాటకు ఎంతో కట్టుబడి ఉండేవాడు. ఇంట్లో మిగిలిన అందరూ కూడా అల్లరి చేస్తే మహేష్ బాబు ఒక్కడే తల్లి మాట ఎక్కువగా వినేవారు అని వారి సోదరీమణులు చెబుతూ ఉండేవారు. తల్లితో ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకున్న మహేష్ బాబు ఆమెను కోల్పోవడంతో ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు.

 విజయనిర్మలతో అనుబంధం

విజయనిర్మలతో అనుబంధం

ఇక సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఘట్టమనేని ఫ్యామిలీకి ఆమె చాలా దగ్గరగానే ఉన్నారు. ఆమె మరణించినప్పుడు కూడా మహేష్ బాబు ఎంతో మనోవేతనకు గురయ్యారు. ఎందుకంటే ఆమె ఎలాంటి విభేదాలు చూపించకుండా మహేష్ ను కూడా ఒక కొడుకు తరహాలోనే ట్రీట్ చేసేవారు. ముఖ్యంగా మహేష్ బాబు తల్లి ఇందిరా దేవితో కూడా విజయనిర్మలకు మంచి అనుబంధం ఉంది. ఆమె 2018లో మరణించిన విషయం తెలిసిందే.

బిఏ రాజుతో ఆత్మీయత

బిఏ రాజుతో ఆత్మీయత

ఇక మహేష్ బాబుకు సినిమా పరిశ్రమలో పిఆర్ఓ గా ఎంతో దగ్గరైనా బిఏ రాజు మరణం కూడా ఎంతో బాధను కలిగించింది. ఎందుకంటే మహేష్ బాబు ప్రతి సినిమాకు కూడా బిఏ రాజు PRO గా కొనసాగుతూ వచ్చారు. మహేష్ బాబుకు ఎంతో దగ్గరైనటువంటి అతను 2021 మే 21న మరణించారు. అప్పుడు కూడా మహేష్ బాబు చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ విధంగా మహేష్ బాబు మూడేళ్ల కాలంలోనే వరుస విషాదలను చూడాల్సి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X