బావ మహేష్‌కు జబర్దస్త్ దావత్.. గ్రాండ్‌గా సుధీర్ బాబు భార్య బర్త్‌డే.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్

మహేష్ బాబు వెండితెర ప్రపంచంలో సూపర్ స్టార్ అయినప్పటికీ తన ఫ్యామిలీ వరల్డ్ లో మాత్రం ఒక నార్మల్ పర్సన్ గా ఉంటాడని అందరికి తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం అంటే మహేష్ కి ఎంత ఇష్టమో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ ఫ్యామిలీ మ్యాన్ చాలా రోజుల తరువాత తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న పార్టీలో పాల్గొన్నాడు. ఇక ఈ దావత్ ఇచ్చింది మరెవరో కాదు.. ఆయన బావ సుధీర్ బాబు.

భార్య పుట్టినరోజు పార్టీలో..

భార్య పుట్టినరోజు పార్టీలో..

హీరో సుధీర్ బాబు, మహేష్ బాబు చాలా క్లోజ్ అని పెద్దగా ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు వారానికోసారి కలుసుకుంటూనే ఉంటారు. రెగ్యులర్ గా కొత్త సినిమాలపై చర్చించుకుంటు ఉంటామని సుధీర్ బాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక లాక్ డౌన్ తరువాత కొంచెం గ్యాప్ రావడంతో మళ్ళీ ఫ్యామిలీ మొత్తం ఒక చోట చేరింది. సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పుట్టినరోజు కావడంతో ఘట్టమనేని వారిని ఇంటికి పిలిచి సుధీర్ బాబు మంచి దావత్ ఇచ్చాడు.

 రుచికరమైన విందు కూడా..

రుచికరమైన విందు కూడా..

బర్త్ డే పార్టీలో మహేష్ బాబుతో పాటు ఆయన సతీమణి నమ్రత అలాగే జయదేవ్ గల్లా, ఆది శేషగిరిరావు, మంజుల, సంజయ్ స్వరూప్ కూడా ఉన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణను కూడా ఈవెంట్ కి పిలిచిన సుధీర్ బాబు కేక్ కట్ చేయించి రుచికరమైన విందు కూడా ఏర్పాటు చేయించారు. అందరు కలిసి ఒకే చోట భోజనం చేసిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాయంత్రం వరకు సిస్టర్స్ తోనే..

సాయంత్రం వరకు సిస్టర్స్ తోనే..

ఉదయం నుంచి సాయంత్రం వరకు మహేష్ తన సోదరీమణులతోనే సమయాన్ని గడిపాడు. ఇక కృష్ణ కారులో ఇంటికి వెళుతుండగా అందరు గేటు దగ్గర సాగనంపిన ఫొటో కూడా వైరల్ అవుతోంది. మొత్తానికి చాలా రోజుల తరువాత మహేష్ బాబు ఒక ఫ్యామిలీ పార్టీలో చాలా ఎంజాయ్ చేశాడని తెలుస్తోంది.

Recommended Video

Keerthy Suresh's Telugu Debut Aina Ishtam Nuvvu Teaser
 మహేష్ న్యూ లుక్ వైరల్..

మహేష్ న్యూ లుక్ వైరల్..

ఇక మహేష్ బాబు న్యూ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెక్స్ట్ సూపర్ స్టార్ సర్కారు వారి పాట సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. యూఎస్ లో ఒక పెద్ద షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారు. ఇక ఆ సినిమాలో మహేష్ గతంలో ఎప్పుడు లేని విధంగా న్యూ హెయిర్ స్టైల్ లో స్మార్ట్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. చూస్తుంటే మహేష్ ఈ సారి లేడి ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తాడని అనిపిస్తోందని కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X