టాలీవుడ్‌కు బిగ్‌షాక్.. జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం, మొదటి దెబ్బ దేవర పైనే!
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. హైడ్రాను రంగంలోకి దించి ఆక్రమణలు, భూకబ్జాల అంతు చూస్తున్న ప్రభుత్వం మరిన్ని షాకులిచ్చేందుకు సిద్దమవుతోంది. ఎప్పుడు సర్కార్ నుంచి ఎలాంటి షాకింగ్ న్యూస్ వినాల్సి వస్తుందోనని బడా బాబులు భయపడుతున్నారు. ఈ లిస్ట్‌లో సినీ ప్రముఖులు కూడా ఉన్నారని టాక్. తాజాగా వారు భయపడుతున్నదే జరిగింది. జీహెచ్ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి ఓ సంచలన నిర్ణయం తీసుకుని టాలీవుడ్‌కు షాకిచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
విపత్తుల వేళ సాయం చేసేందుకు , ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఈ బృందానికి రేవంత్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో రోజుకొక అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తూ చెమటలు పట్టిస్తోంది. హైడ్రా రాకతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అధికార యంత్రాంగం చాలా అక్రమ కట్టడాలను కూల్చివేసినప్పటికీ.. టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో రేవంత్ ఎవ్వరినీ వదిలిపెట్టరనే భయం మొదలైంది. దీంతో ఎప్పుడు , ఎవరిపై హైడ్రా విరుచుకుపడుతుందోనని బడా బాబులకు నిద్ర కరువైంది.

హైదరాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చే పనిని చేపట్టిన జీహెచ్ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో వరదలు, ముంపు సమస్యలు తలెత్తకుండా నాళాల ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ పేరుతో నదికి ఆనుకుని ఉన్న ఇళ్లను తొలగించే పనులను ప్రారంభించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన వారి కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సిద్ధం చేస్తున్నారు.
తాజాగా ఆమ్రపాలి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్‌పై నిషేధం విధించారు. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై వాల్ పోస్టర్లు అతికించడం, వాల్ రైటింగ్‌ను నిషేధిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమ్రపాలి హెచ్చరించారు. ఈ మేరకు పోస్టర్లు ఎక్కడా అతికించకుండా చూడాలని డిప్యూటీ కమీషనర్లను ఆమె ఆదేశించారు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ.. సినీ పరిశ్రమకు ఆమె నిర్ణయంతో షాక్ తగిలినట్లయ్యింది.
సినిమా థియేటర్ వాళ్లు కూడా ఎక్కడా పోస్టర్లు అతికించకుండా పర్యవేక్షించాలని ఆమ్రపాలి ఆదేశించడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా కొత్త సినిమాలు వచ్చినప్పుడు అవి ఏ థియేటర్‌లో ఆడుతున్నాయో తెలుసుకోవడంలో పోస్టర్లు కీలకపాత్రలు పోషిస్తాయి. ముఖ్యంగా నిరక్షరాస్యులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అలాంటిది వాల్ పోస్టర్లను అతికించకుండా బ్యాన్ విధించడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. నిర్ణీత ప్రదేశాలలో అతికించకుండా నిషేధం విధించాలని వారు సూచిస్తున్నారు. సెప్టెంబర్ 27న జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీహెచ్ఎంసీ నిర్ణయం ఈ సినిమాపై పడుతుందేమోనని ఫిలింనగర్‌లో చర్చ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











