నాగార్జున, వెంకటేష్‌లకు బిగ్ షాక్.. జీహెచ్‌ఎంసీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున, దగ్గబాటి వెంకటేష్ లకు బిగ్ షాక్ తగిలింది. వీరి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రముఖ అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ సినీ ప్రొడక్షన్ హౌస్‌లు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్ లకు జీహెచ్ఎంసీ (GHMC) భారీ షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజును సంవత్సరాలుగా తక్కువ చెల్లిస్తూ, వ్యాపార విస్తీర్ణాన్ని కావాలనే తగ్గించి చూపి పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు జీహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు గుర్తించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకున్న అధికారులు రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలుస్తోంది.

GHMC Issues Notices to Annapurna and Ramanaidu Studios for Underpaying Trade License Fees

జీహెచ్ఎంసీ ప్రకారం.. అన్నపూర్ణ స్టూడియో విస్తీర్ణం ప్రకారం సంవత్సరానికి రూ. 11.52 లక్షలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండగా, స్టూడియో నిర్వాహకులు కేవలం రూ. 49 వేలే చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఇదే విధంగా రామానాయుడు స్టూడియోస్ విషయంలో కూడా పెద్ద ఎత్తున వ్యత్యాసాలు బయటపడ్డాయి. వాస్తవ విస్తీర్ణం ప్రకారం రూ. 1.92 లక్షలు చెల్లించాలి కాగా, కేవలం రూ. 1,900 మాత్రమే బల్దియాకు చెల్లించినట్లు పరిశీలనలో బయటపడింది.

ఈ రెండు స్టూడియోలు వందల కోట్ల వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూనే, అధికారిక పత్రాల్లో విస్తీర్ణాన్ని తక్కువగా చూపడం ద్వారా పన్నులను పెద్ద ఎత్తున మినహాయింపు పొందుతున్నాయన్న ఆరోపణలు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. స్టూడియోలు సంపాదిస్తున్న ఆదాయం, జరుగుతున్న ప్రొడక్షన్‌లు, అద్దెకు ఇచ్చే షూటింగ్ ఫ్లోర్లు అన్ని కలిసి భారీగా వ్యాపారం జరుగుతున్నా, ఫీజుల్లో మాత్రం చిన్న మొత్తాల్లో మాత్రమే చెల్లిస్తున్నట్టు అధికారులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ఈ రెండు స్టూడియోలకు అధికారిక నోటీసులు జారీ చేస్తూ, వెంటనే పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని ఆదేశించారు. చెల్లింపులో ఆలస్యం చేస్తే జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సూచించారు. ఇదే తరహాలో నగరంలోని ఇతర పెద్ద వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ ఆఫీసులు, సినిమా ప్రొడక్షన్ హౌస్‌లపై కూడా సర్వే కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X