నిర్మాత సురేష్ బాబు ఇంటిని కూల్చేందుకు రంగం సిద్ధం!
జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సిబ్బంది హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలని కూల్చి వేసేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో మాదాపూర్ లో ఇబ్బడి ముబ్బడిగా కడుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపు వివాదంగా మారింది. ఈ వివాదంలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు పేరు వినిపిస్తోంది. మాదాపూర్ లోని ఖనమెట్ భాగ్యనగర్ వెల్ ఫేర్ సొసైటీలోని అక్రమ నిర్మాణాలని తొలగించడానికి టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడకు వెళ్లారు.
ఓ ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించగా ఎసిపి కొడుకు ఒకరు టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై దాడికి దిగాడు. సిబ్బంది కూల్చేయడానికి ప్రయత్నించిన ఇల్లు ప్రముఖ నిర్మాత సురేష్ బాబుకు చెందినదిగా తెలుస్తోంది. సురేష్ బాబు తరుపున ఎసిపి కొడుకు సిబ్బందిపై దాడికి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. సిబ్బందిని కారులో కొట్టుకుంటూ తీసుకువెళ్లాడట. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఎసిపి కొడుకుతో పాటు మరికొందరు వ్యక్తులు కూడా సిబ్బందిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాడికి దిగిన వ్యక్తి ఎవరో, అతడి వివరాలు ఏంటో తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.


Click it and Unblock the Notifications











