అనుమానంగా చూస్తున్న రాశీఖన్నా.. ఎంజాయ్ చేస్తోన్న హీరో
ఎప్పుడూ ఒకే ఫార్మూలాను వాడితే జనాలకు విసిగెత్తి పోతుంది. ఎంత కామెడీని ఇరికించిన కథాకథనాల్లో కొత్త దనం కనిపించగా.. జనాలు చీకొడతారు. భలేభలే మగాడివోయ్ సినిమాలో హీరోకు లోపం పెట్టి.. హిట్టు కొట్టాడు మారుతి. అయితే ఆ కథ బాగానే వర్కౌట్ అయింది కదా అని అదే ఫార్మాట్‌లో సినిమాలు తీయడం మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాడు ఈ దర్శకుడు.
మహానుభావుడు, బ్రాండ్ బాబు, శైలజా రెడ్డి అల్లుడు ఇలా ప్రతీదాంట్లో ఎవరికో ఒకరికి ఏదో రోగం ఉన్నమున్నట్లు.. దాంట్లోంచి కొంత ఎంటర్టైన్మెంట్, కొంత ఎమోషన్ లాగేసి కథనాన్ని అల్లుకున్నాడు. అయితే భలేభలేమగాడివోయ్ మ్యాజిక్‌ను మాత్రం రిపీట్ చేయలేకపోయాడు. అయితే కొత్త కథను రాసుకోవాలని అర్థం చేసుకున్న మారుతి.. ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు బూతు సినిమాల దర్శకుడని పేరు తెచ్చుకున్న మారుతి.. క్రమక్రమంగా జానర్‌ను మార్చుకుంటూ తనపై పడిన ముద్రను తొలగించుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రతిరోజూ పండగే అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నేడు ఈ మెగా హీరో పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్న టీజర్‌లాంటింది రిలీజ్ చేశాడు.

ఈ వీడియోను చూస్తే.. ఓ చక్కటి కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. తాతా, మనవడు, తండ్రి, మరదలు, ఉమ్మడి కుటుంబం ఇలా నాటి తెలుగు చిత్రాలను గుర్తుకు తెచ్చేలా కట్ చేసి వదిలారు. హీరోయిన్ అనుమానంగా చూస్తుంటే.. హీరో మాత్రం తాత చేసే అల్లరిని చూసి ఆనందిస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే సినిమా గ్యారెంటీగా హిట్టు అయ్యేలానే కనిపిస్తోంది. ఈ మూవీలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.


Click it and Unblock the Notifications











