Ram Charan: పెళ్లికి అందని ఆహ్వానం.. మళ్లీ అవమానం ఫీలై సోషల్ మీడియాలో రచ్చ లేపిన రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్, బుచ్చిబాబుతో ఆర్సీ 16, త్వరలో సుకుమార్ తో ఆర్సీ 17 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు చెర్రీ. అయితే తాజాగా చెర్రీ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చలేపుతుంది. పెళ్లికి పిలువలేదంటూ రామ్ చరణ్ ఫీలై.. ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు ఎవరి పెళ్లి.. ఎవరు ఎందుకు పిలువలేదు.. అసలేం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరుకుంది. ఆయన బయట కనిపించినా, ట్వీట్ పెట్టినా.. క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ప్రస్తుతం చెర్రీ.. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో ప్రారంభం అయింది కానీ ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి సరైనా సాలిడ్ అప్డేట్స్ రాకపోవడంతో చెర్రీ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇక చరణ్ బర్త్ డే రోజు అప్డేట్ వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు.

Global Star Ram Charan And Anand Mahindra Tweets About Sujith Marriage News Goes Viral

మరోవైపు బుచ్చిబాబు సనతో కలిసి ఆర్సీ 16 సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో చెర్రీ సరసన మొదటి సారిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరుపుకుంది. సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా.. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి సుకుమార్ తో కలిసి తన 17వ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. తన బర్త్ డే సందర్భంగా అప్డేట్స్ వస్తాయని సమాచారం.

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట రచ్చలేపుతుంది. తనను ఎందుకు పెళ్లికి పిలువలేదంటూ పోస్ట్ పెట్టాడు చెర్రీ. ఇప్పటికే ముఖేష్ అంబానీ పెళ్లికి వెళ్లిన రామ్ చరణ్... అక్కడ షారుఖ్, సల్మాన్ వంటి బాలీవుడ్ నటులు అవమానించారని వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇడ్లీ వడ సంబార్ అంటూ చెర్రీని సంబోధించిన రచ్చలేపింది. ఇప్పుడు చెర్రీ మళ్లీ అవమానం ఫీలై తనను పెళ్లికి ఎందుకు పిలువలేదు అంటూ ట్వీట్ పెట్టారు.

ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ యజమాని ఆనంద్ మహీంద్రాకు చరణ్ స్పెషల్ ట్వీట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. సుజీత్ పెళ్లికి నన్ను ఎందుకు ఆహ్వానించలేదంటూ చరణ్ పోస్ట్ పెట్టాడు. ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేశాడు కూడా. ఇక ఇది చూసిన ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. గందరగోళంలో పడి మర్చిపోయాను అంటూ చరణ్ కు మరో ట్విట్ ద్వారా రిప్లై ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన పెళ్లి పిలుపుల ముచ్చట నెట్టింట వైరల్ గా మారింది.

అయితే ఇంతకీ సుజీత్ ఎవరంటే.. 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ గా మారడమే మహీంద్రా లక్ష్యమని పేర్కొంటూ సదరు సంస్థ ఓ యాడ్ ను రిలీజ్ చేసింది. కొన్నేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ ప్రాంతంలో మహీంద్రా ఫ్యాక్టరీ నిర్మించారు. అంతే కాదు.. అక్కడ లక్షలాది మంది చెట్లు నాటారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ నిర్మించడంతో అక్కడ దాదాపు 400 అడుగులు అండర్ గ్రౌండ్ వాటర్ లెవల్ పెరిగింది. దీంతో ఆ గ్రామంలోని అబ్బాయిలకు ఎవరు పిల్లను ఇవ్వలేదని... ఇప్పుడు ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి తగ్గడంతో అక్కడ ఉన్న సుజీత్ కు పెళ్లి ఫిక్స్ అయ్యిందని ఓ వీడియోను రిలీజ్ చేశారు.

ఇక ఆ వీడియోపై రామ్ చరణ్ స్పందిస్తూ.. సుజీత్ పెళ్లికి నన్నెందుకు పిలవలేదని ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు. జహీరాబాద్ కు దగ్గర్లోనే నేను ఉండేది... ఆ ప్రాంతంలో నా స్నేహితులను సరదాగా కలిసివాడిని అంటూ రాసుకువచ్చారు. ఏమైనా మీది గ్రేట్ వర్క్ అంటూ ట్వీట్ చేశాడు చెర్రీ. ఇక చరణ్ పోస్ట్ కు ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. "గందరగోళంలో ఉండి మీకు ఆహ్వనం పంపించడం మర్చిపోయా.. అంటూ రిప్లై ఇచ్చారు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను అంటూ చరణ్ రిప్లై ఇవ్వడంతో... ప్రస్తుతం వీరిద్దరు ట్వీట్స్ వైరల్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X