Ram Charan: రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్.. ఏరోజు అందుకోబోతున్నారో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు సినీ ప్రియులకు.. కాదు కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన కెరియర్ గ్రాఫ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో మారిపోయింది. ఈ సినిమాకు ముందు రీజనల్ హీరోగా ఉన్న ఈయన ఆ చిత్రం తర్వాత గ్లోబల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేసుకున్న ఈయనకు తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ముఖ్యంగా రామ్ చరణ్ కు ఓ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం 39 ఏళ్ల వయసు కల్గిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2007లో చిరుత సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత నుంచి వరుసగా అదిరిపోయే చిత్రాలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు 15 చిత్రాలు చేసిన ఈయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం ఆర్ఆర్ఆర్ సినిమానే. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ హీరోలుగా చేసి ఇరగదీశారు. ఈ చిత్రాం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Global Star Ram Charan Was Awarded an Honorary Doctorate Check Full Details

ఈ సినిమా వల్లే రామ్ చరణ్ కు అనేక అవార్డులు వచ్చాయి. ఇందులోని నాటు నాటు సాంగ్ కు అయితే ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాలో నటించి ప్రతీ ఒక్కరికీ మంచి గుర్తింపే వచ్చింది. అయితే తాజాగా మరో సారి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైకు చెందిన వేల్స్ యూనివర్సిటీ చెర్రీకి డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13వ తేదీనే ఆయనకు ఆ డాక్టరేట్ ను ప్రదానం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లిన ఈయనే అక్కడ అవార్డు అందుకోబోతున్నట్లు సమాచారం.

అయితే రామ్ చరణ్ తెలుగు సినీ రంగానికి అందిస్తున్న సేవలకు గానే ఈ డాక్టరేట్ ను వేల్స్ యూనివర్సిటీ అందించబోతుందట. ఇదంతా ఇలా ఉండగా.. రామ్ చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా శంకర్ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ డ్రామాగా రూపొందుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన కియా కియారా అద్వానీ హీరోయన్ గా నటిస్తోంది.

Global Star Ram Charan Was Awarded an Honorary Doctorate Check Full Details

అలాగే అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ పనులు చూసుకుంటున్నారు. అలాగే షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకోగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చూడాలి మరి ఈ ఏడాది చివరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X