Globe Trotter: 16 ఏళ్ల క్రితమే డీల్.. మాట నిలబెట్టుకున్న మహేశ్, రాజమౌళి
Globe Trotter Event: సూపర్ స్టార్ మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'గ్లోబ్ ట్రాటర్'(SSMB29)ప్రాజెక్ట్ గురించి ప్రతీ చిన్న అప్‌డేట్ ఒక సంచలనమే. ఇక ఈ సినిమా కోసం నేడు (నవంబర్ 15) రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే గ్రాండ్ ఈవెంట్ గురించి సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతోంది. ఈ ఈవెంట్ కోసం టీమ్ డిజైన్ చేసిన ఎంట్రీ పాసులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. 'గ్లోబ్ ట్రాటర్'ఈవెంట్ నేపథ్యంలో నిర్మాత కె.ఎల్. నారాయణ (KL Narayana) వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
ఒక సినిమా హిట్ అయితే చాలు నిర్మాతలు "మా దగ్గరే తదుపరి సినిమా చేయాలి" అంటూ క్యూలో నిలబడటం ఇండస్ట్రీలో సహజమే. కానీ, అటువంటి ఆఫర్లు ఎన్నో వచ్చినా కూడా రాజమౌళి మాత్రం దాదాపు 16 సంవత్సరాల క్రితం ఇచ్చిన మాటను మరవలేదు. నిర్మాత కె.ఎల్. నారాయణకు అప్పుడే వాగ్దానం చేసిన సినిమానే ఇప్పుడు మహేశ్ బాబు హీరోగా రూపుదిద్దుకుంటున్న GlobeTrotter / SSMB29. ఈ కాంబినేషన్ ఇప్పటి క్రేజ్ చూసినా, అది అప్పుడే ఖరారయిందన్న విషయం చాలామందికి తెలియదు.

కె.ఎల్.నారాయణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజమౌళి-మహేశ్ బాబు ఇద్దరూ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గర్వంగా చెప్పారు. "దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై తమ తదుపరి సినిమా చేస్తాం" అని ఇద్దరూ ముందే ప్రకటించడం తమ పనిపై ఉన్న నిబద్ధతను చూపించినట్లు అన్నారు. నిర్మాత నారాయణ తక్కువ సినిమాలు చేసినా, ఎంచుకున్నవి మాత్రం నాణ్యత ఉన్నవే. 'రాఖీ' తర్వాత రెండు సినిమాలు ప్లాన్ చేసినా అవి అనివార్య కారణాల వల్ల ఆగిపోయాయి. అప్పుడు రాజమౌళి-మహేశ్‌తో కలిసి సినిమా చేద్దామని అంగీకరించారు.
కానీ రాజమౌళి అప్పటికే ఇతర ప్రాజెక్టులకు కమిట్ కావడం, ముఖ్యంగా 'బాహుబలి' వంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌లకు సంవత్సరాల తరబడి సమయం వెచ్చించాల్సి రావడం, ఆ తరువాత కోవిడ్ పరిస్థితులు ఇవన్నీ కలిసి ప్రాజెక్ట్‌ను వెనక్కి నెట్టి, ఆలస్యానికి కారణమయ్యాయి. అప్పుడు కాంబినేషన్ ఫిక్స్ అయినా కథ మాత్రం సిద్ధంగా లేదు. 'RRR' పూర్తయ్యాకనే రచయిత విజయేంద్ర ప్రసాద్ కథపై పని మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.
"నేను నిర్మాతగా విరామం తీసుకోవాలని అనుకోలేదు. కానీ ఈ సినిమా కోసం ఓపిక పట్టాల్సి వచ్చింది. రాజమౌళి-మహేశ్ బాబు క్రేజ్ ఇప్పుడు మరో స్థాయిలో ఉన్నా కూడా, నాకు ఇచ్చిన మాట కోసం సినిమా చేస్తున్నారు. చెప్పకపోయినా మా బ్యానర్ పేరే మొదట ప్రకటించారు. రాజమౌళికి హాలీవుడ్ నుంచే పెద్ద ఆఫర్లు వచ్చినా వాటిని పక్కనపెట్టి నాకు సినిమా చేస్తున్నారు" అని నారాయణ పేర్కొన్నారు.
రాజమౌళి పని తీరు గురించి మాట్లాడుతూ.. "కథా చర్చల్లో నిర్మాతల్ని పోనీయరని మాట అందరికీ వర్తించదు. జక్కన్న మాత్రం ప్రతి ఒక్క విషయాన్ని నిర్మాతతో పంచుకుంటారు. చిన్న పాయింట్‌నూ చాలా పర్‌ఫెక్షన్‌గా చూస్తారు. మహేశ్ కూడా పాత్రకు తగ్గట్టు తనను తాను మార్చుకుంటున్నారు. కథ అద్భుతంగా ఉంది. బడ్జెట్ ఇంకా ఖరారు చేయలేదు; కానీ సినిమా కోసం ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టేందుకు సిద్ధం" అని నిర్మాత నారాయణ గతేడాది ఓ మాట్లాడారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ నెట్టింట్లో వైరల్ మారింది. మహేశ్ - రాజమౌళి కాంబోపై అభిమానుల్లో ఉన్న భారీ అంచనాలు నిర్మాత నారాయణ వ్యాఖ్యలతో మరింత పెరిగాయి.
ఇదిలా ఉంటే.. 'గ్లోబ్ ట్రాటర్'(SSMB29)ప్రాజెక్ట్ గురించి ప్రతీ చిన్న అప్‌డేట్ ఒక సంచలనమే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ ఎంటీ? అనే ప్రశ్న చర్చనీయంగా మారింది. ఇప్పటికే గరుడ, రుద్ర, వారణాసి, సంచారి అంటూ అనేక పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. #GlobeTrotter హ్యాష్‌ట్యాగ్‌తో జక్కన్న టీమ్ ప్రచారం చేయడం గ్లోబల్ నేపథ్యాన్ని సూచిస్తుంది. అలాగే.. ఇది ఎలాంటి జానర్ కథ? టైటిల్ ఏంటి? టీజర్ ఇస్తారా? ఏకంగా ట్రైలర్‌తో సర్‌ప్రైజ్ చేస్తారా? ఇలాంటి సందేహాలన్నింటికీ మరికొన్ని గంటల్లో ఫుల్‌స్టాప్ పడనుంది.


Click it and Unblock the Notifications











