GlobeTrotter Event: 30 నిమిషాలు.. మహేశ్ బాబు విశ్వరూపం.. హైప్ పెంచిన విజేంద్ర ప్రసాద్..
Globe Trotter Event: సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29పై అంచనాలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా దేశవ్యాప్తంగా మాత్రమే కాక, అంతర్జాతీయ స్థాయిలో కూడా ట్రెండ్ అవుతోంది. అటువంటి నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న 'గ్లోబ్ ట్రాటర్' (Globe Trotter) ఈవెంట్ కోసం సినీప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ ఈవెంట్‌లో టైటిల్ రివీల్, మహేశ్ బాబు ఫస్ట్ లుక్ లేదా కాన్సెప్ట్ వీడియో వంటి కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో అభిమానులు నిమిషాల లెక్కపెడుతున్నారు.
ఈ ఈవెంట్‌లో రచయిత విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. "కొన్ని సార్లు మాట్లాడాలంటే మాటలు రావు... ఏం మాట్లాడాలో తెలియదు.కానీ ఒక్కొక్కసారి మాట్లాడడానికి చాలా ఉంటుంది. కానీ ఏది ముందు చెప్పాలో అర్థం కాక మాటలు రావు. కానీ ఒక్కొక్కసారి దేవుని అనుగ్రహం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని మొదటిసారి చూడగానే వచ్చే ఫీలింగ్, హిమాలయాలను చూసినప్పుడు కలిగే అద్భుతమైన అనుభూతి... అలాంటిదే ఈ చిత్రంలో ఒక సీక్వెన్స్‌లో నాకు జరిగింది," అని వెల్లడించారు.

ఓ సన్నివేశాన్ని వివరించుతూ.. "ఈ సినిమాలో 30 నిమిషాలపాటు ఉండే ఓ సీన్‌లో మహేశ్ బాబు విశ్వరూపాన్ని చూశాను. ఆ సన్నివేశంలో CGI లేదు... బ్యాక్‌గ్రౌండ్ లేదు... అయినా ఆయనలో దైవత్వం కనిపించింది. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు దేవతలతో చేయించుకుంటారు. ఈ సినిమా రెండో వర్గానికి చెందుతుంది" అని అన్నారు. అంతేకాకుండా రాజమౌళిపై ప్రత్యేక వ్యాఖ్య చేస్తూ.. "రాజమౌళి గుండె మీద హనుమాన్ ఉన్నాడు... ఆయన ఊపిరితో కర్తవ్యం బోధిస్తున్నాడు. హనుమికి రామనామం ఇష్టం... రాజమౌళికి సినిమా ధర్మం ఇష్టం," అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు అక్కడ ఉన్న అభిమానులను మాత్రమే కాదు, నెట్టింట చూస్తున్న సినీప్రియులను కూడా షాక్‌లోకి నెట్టాయి. మహేశ్ బాబు పాత్ర ఏ స్థాయిలో ఉండబోతోందో, సినిమాలోని 30 నిమిషాల హై-ఇంటెన్సిటీ సీక్వెన్స్ ఏమిటో అన్న ఆసక్తి మరింత పెరిగిపోయింది. సినిమా యాక్షన్, అడ్వెంచర్ నేపథ్యంతో ప్రపంచాన్ని చుట్టే కథ అనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఈవెంట్‌కూ 'గ్లోబ్ ట్రాటర్' అనే పేరు పెట్టినట్టు తెలుస్తోంది. రాజమౌళి తన టీమ్‌తో కలిసి ఈ ఈవెంట్‌ను పూర్తిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్లు, హై రిజల్యూషన్ విజువల్ సెటప్, పాస్‌పోర్ట్ స్టైల్ ఎంట్రీ పాసులు అన్ని కలిసి గ్రాండ్ విజన్‌ను చూపిస్తున్నాయి.
విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో SSMB29 కేవలం ఒక సినిమా కాదు... ఒక "సినిమాటిక్ సంచలనం" అని అభిమానులు భావిస్తున్నారు. రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ భారతీయ సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్లబోతోందని స్పష్టంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











