SSMB29 టైటిల్ ఇదే.. గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న మహేశ్ బాబు గ్లింప్స్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న మూవీ ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా టైటిల్ ఏంటీ? అనే దానిపై మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ ఉత్కంఠకు తెరదించాలని భావించిన రాజమౌళి.. నవంబర్ 15న హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌కు ప్లాన్ చేశారు. ఆ రోజున ఎస్ఎస్ఎంబీ 29 టైటిల్, మహేశ్ లుక్ రివీల్ చేస్తామని అనౌన్స్ చేశారు.

Globe Trotter SS Rajamouli-Mahesh Babu s SSMB29 Movie titled as Varanasi

ఎస్ఎస్ఎంబీ 29 బడ్జెట్
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ ఎస్ఎస్ఎంబీ 29 సినిమాను నిర్మిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి తొలి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా... మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై హైప్ పెంచేలా పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు జక్కన్న. దాంతో ఎస్ఎస్ఎంబీ 29పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కుంభగా పృథ్వీరాజ్... మందాకినిగా ప్రియాంక చోప్రాలు నటిస్తున్నారు.

గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌పై ఆసక్తి
అయితే ఈ సినిమా టైటిల్, మహేశ్ బాబు లుక్‌ను నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌లో అనౌన్స్ చేస్తామని రాజమౌళి ప్రకటించడంతో చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. మహేశ్ లుక్‌ ఇదేనంటూ ఇప్పటికే ఏఐతో రూపొందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. కెరీర్‌లోనే తొలిసారిగా భారీ గడ్డం, లాంగ్ హెయిర్‌తో మహేశ్ బాబు కనిపించడంతో ఆయన రోల్, లుక్‌పై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో కావాల్సిందే
ఇక గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ ప్రసార హక్కులను జియో హాట్‌స్టార్‌కి విక్రయించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుడు నేపథ్యంలో హై అలర్ట్ కొనసాగుతున్న తరుణంలో అభిమానులకు జాగ్రత్తలు చెప్పారు జక్కన్న. ఇది ఓపెన్ ఈవెంట్ కాదని, పాస్‌లు ఉన్న వారికే ఎంట్రీ ఉంటుందని, ప్రతి ఒక్కరూ స్ట్రిక్ట్ రూల్స్‌ను పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు రాజమౌళి.

ఎస్ఎస్ఎంబీ 29 టైటిల్ ఇదే
ఇక ఎస్ఎస్ఎంబీ 29 సినిమాకు సంచారి, వారణాసి అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ ఎస్ఎస్ఎంబీ 29కి వారణాసి అనే టైటిల్‌ను ఖరారు చేశారు జక్కన్న. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌లో భారీ స్క్రీన్‌పై టైటిల్‌ను ప్రదర్శించారు. మహేశ్ బాబు చేతిలో త్రిశూలం పట్టుకుని ఎద్దుపై వస్తుండగా వారణాసి టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ గ్లింప్స్.. మహేశ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇక ఈ చిత్రంలోని మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా రాజమౌళి అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: ss rajamouli mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X