For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సర్కారు వారి పాట’ నుంచి అదిరిపోయే న్యూస్: సినిమాకే హైలైట్‌గా నిలిచేది కంప్లీట్

  |

  బాల నటుడిగా ప్రయాణాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా మారాడు సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకుని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు సూపర్ డూపర్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. దీనికి కారణం.. ఈ మధ్య కాలంలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా మూడు హిట్లను తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్‌ను నమోదు చేయడమే. ఈ ఉత్సాహంతోనే మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఇందుకోసం కథలను వింటూ ప్రయాణం సాగిస్తున్నాడు.

  టూపీస్ బికినీలో రామ్ చరణ్ భామ ఘాటు ఫోజులు: బట్టలు ఉన్నా లేనట్లే మరీ దారుణంగా!

  కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. బ్యాంకులను మోసం చేసి పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎప్పుడో ప్రారంభించినా.. అనివార్య కారణాల వల్ల షూటింగ్ మాత్రం ఏకధాటిగా సాగడం లేదు. దీంతో ఇది మరింత ఆలస్యం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే చిత్ర యూనిట్ మూడో షెడ్యూల్ కోసం గోవా చేరుకుంది. అక్కడ సినిమా షూటింగ్ నిరంతరాయంగా జరుగుతూ వచ్చింది.

  Goa Fight Highlight in Mahesh Babus Sarkaru Vaari Paata

  గతంలో పలు లీకులు రావడంతో గోవాలో జరుగుతోన్న 'సర్కారు వారి పాట' షెడ్యూల్ గురించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుందని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ షూట్ తాలూకు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. గోవాలో జరుగుతోన్న మూడో షెడ్యూల్ తాజాగా ముగిసిందట. ఇందులో సినిమాకే హైలైట్‌గా నిలవబోయే ఓ ఫైట్ సీన్‌ను చిత్రీకరించారని తెలుస్తోంది. దీనికి ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్‌ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ దాదాపు పదిహేను నిమిషాలు ఉంటుందని సమాచారం.

  అభిమాని పెళ్లిలో పవన్ కల్యాణ్: ఇదేం క్రేజురా నాయనా.. తల్లిదండ్రులను కూడా కాదని పవర్‌స్టార్‌తో!

  'సర్కారు వారి పాట' మొదటి షెడ్యూల్‌ను దుబాయ్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత కూడా అమెరికాలో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేయగా.. కరోనా నిబంధనల కారణంగా అది సాధ్య పడలేదు. దీంతో హైదరాబాద్‌లోనే కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరిపించారు. దీని తర్వాత ఇప్పుడు గోవా షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఇక, ఇప్పుడు మళ్లీ విదేశీ పర్యటనను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ పలు పాటలను షూట్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే, క్యాసినో బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్‌ను కూడా చిత్రీకరించనున్నారని విశ్వసనీయంగా తెలిసింది.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబు మాస్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ భారీ చిత్రంపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

  English summary
  Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. Now This Movie Goa Schedule Completed With Highlight Fight.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X