twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    GodFather సాంగ్ పై ట్రోలింగ్.. మళ్ళీ దొరికిన థమన్.. ఈసారి చిన్న పిల్లల సాంగ్ కాపీ అంటూ..

    |

    సంగీత దర్శకుడు థమన్ కొన్నిసార్లు డిఫరెంట్ మ్యూజిక్ తో ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమా సక్సెస్ లో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా అల.. వైకుంఠపురములో సినిమా అనంతరం అతని మ్యూజిక్ విధానం కూడా చాలా వరకు మారిపోయింది అని ప్రశంసలు వచ్చాయి. అయితే అయినప్పటికీ కూడా థమన్ అప్పుడప్పుడు కొన్ని సాంగ్స్ కాపీ కొడుతున్నాడు అనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సాంగ్ కూడా కాపీ కొట్టేశారు అంటూ.. అది కూడా చిన్న పిల్లలు పాడుకునే పాట నుంచి వచ్చింది అని ట్రోలింగ్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.

    ఆ బ్రాండ్ ఉన్నప్పటికీ

    ఆ బ్రాండ్ ఉన్నప్పటికీ

    ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమంలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా మంచి గుర్తింపు అందుకుంటున్న థమన్ ఎలాంటి సినిమా చేసినా కూడా మ్యూజిక్ తోనే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాడు అనే బ్రాండ్ అయితే ఉంది. అయితే అప్పుడప్పుడు అతను చేసే కంపోజింగ్స్ కొన్ని ఇతర పాటలకు కాపీగా ఉంటాయి అని కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి.

     త్రివిక్రమ్ సినిమాకు అలా..

    త్రివిక్రమ్ సినిమాకు అలా..

    ఒక విధంగా తొలిప్రేమ సినిమా తర్వాత థమన్ కంపోజింగ్ విధానం మారింది అని ముఖ్యంగా త్రివిక్రమ్ చేతిలో పడిన తర్వాత థమన్ చాలా కొత్తగా మ్యూజిక్ ఇస్తున్నాడు అని పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. మేయిన్ గా అల..వైకుంఠపురంలములో సినిమాకు థమన్ మ్యూజిక్ ఒక రేంజ్ లో హిట్ అయింది. ఆ సినిమా సక్సెస్ లో థమన్ పాత్ర అయితే చాలానే ఉంది.

    అప్పట్లోనే కాపీ ఆరోపణలు

    అప్పట్లోనే కాపీ ఆరోపణలు

    అయితే థమన్ మ్యూజిక్ కంపోజింగ్ పై కాపీ ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. అతని మొదటి సినిమా కిక్ నుంచి ఆ తర్వాత బిజినెస్ మెన్ ఇంకా మరెన్నో సినిమాలకు థమన్ ఇతర ఇంగ్లీష్ పాటలను కూడా కాపీ కొట్టాడు అని కామెంట్స్ వచ్చాయి. ఇక మధ్యలో అయితే కొంతమంది దర్శకుల సలహాలు మేరకే ఆ విధంగా సాంగ్స్ ను పెట్టాల్సి వచ్చింది అని కూడా థమన్ వివరణ ఇచ్చినప్పటికీ ట్రోలింగ్స్ అయితే ఆగలేదు.

     గాడ్ ఫాదర్ కోసం..

    గాడ్ ఫాదర్ కోసం..

    గాడ్ ఫాదర్ సినిమాకు కూడా ఇప్పుడు థమన్ దొరికిపోయాడు అంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. మొన్నటికి మొన్న విడుదల చేసిన టీజర్ లో అయితే ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మొత్తాన్ని కూడా ఇంతకుముందు గని సినిమాలో ఉన్నదే పెట్టేశారు అని విమర్శలు వచ్చాయి. ఆ విషయంలో అయితే మెగా అభిమానులు తీవ్రస్థాయిలో అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు.

     చిన్న పిల్లల పాటను

    చిన్న పిల్లల పాటను

    అయితే నిన్న విడుదలైన గాడ్ ఫాదర్ ఫస్ట్ సాంగ్ 'తార్ మార్ తక్కర్ మార్' అనే సాంగ్ ప్రోమో కూడా కాపీ అంటూ సోషల్ మీడియాలో మళ్లీ ఒక రేంజ్ లో ట్రోలింగ్ అయితే నడుస్తోంది. యూట్యూబ్లో చిన్నపిల్లల రైమ్స్ నుంచి ఈ సాంగ్ లిరిక్స్ కాపీ కొట్టినట్లుగా ఉంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ అయితే చేస్తున్నారు. తార్ మార్ తక్కర్ మార్.. అనే ఆట చిన్నపిల్లలు ఆడుకుంటారు అని.. అది యూట్యూబ్ కిడ్స్ ఛానల్స్ లో కూడా ఉంటుంది అని ట్రోల్ చేస్తున్నారు

    ఆ రెండు సినిమాల నుంచి..

    ఆ రెండు సినిమాల నుంచి..

    అయితే 'తార్ మార్ తక్కర్ మార్' మ్యూజిక్ కూడా ఇంతకుముందు కంపోజ్ చేసిన చాలా పాటలకు దగ్గరి పోలిక ఉంది అని అందులో రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలోని 'మెగా మెగా బ్రదర్' బీట్ కు ఇది తగ్గట్టుగానే ఉందని కూడా అంటున్నారు. అలాగే క్రాక్ సినిమాలో 'మాస్ బిర్యానీ' అనే పాటలోనే ఇంట్రో బీట్ మొత్తం కూడా ఇదే తరహాలో ఉంది అని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ఇక గురువారం రోజు ఫుల్ సాంగ్ విడుదలవుతోంది. మరి పూర్తి పాట విన్న తర్వాత జనాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

    English summary
    God father movie song promo thaman copy from other tunes Once again trolling
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X