God Father చిరంజీవి మూవీ రిలీజ్‌పై రూమర్లు.. ఖండించిన నిర్మాత ఎన్వీ ప్రసాద్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం భారీ హంగులతో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమాను అట్టహాసంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే దసరా పండుగ కానుకగా ఈ సినిమాను రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తుంటే.. భారీగా ఏర్పాట్లు చేస్తుంటే.. ఓ పక్క ఈ మూవీ విడుదలపై రూమర్లు స్వైర విహారం చేశాయి. దాంతో ఈ సినిమా గురించి నిర్మాత ఇచ్చిన వివరణ ఏమిటంటే?

అంచనాలు పెంచిన బర్త్ డే టీజర్
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అంచనాలు పెంచింది. చిరంజీవి లుక్ ప్రేక్షకులను, సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్నది. డిఫరంట్ గెటప్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో మెగాస్టార్ కేక పెట్టించారు. ఈ టీజర్‌లో రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ అంటూ
చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళంలో గ్రాండ్ సక్సెస్ అందుకొన్న లూసిఫర్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్నది. ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకొంటున్నది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటన చేశారు.

గాడ్ ఫాదర్ రిలీజ్ వాయిదా అంటూ రూమర్లు
అయితే గాడ్ ఫాదర్ రిలీజ్‌పై సోషల్ మీడియాలో భారీగా రూమర్లు విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈ సినిమా దసరాకు రిలీజ్ కావడం లేదు. ఈ సినిమా 2022 సంవత్సరం చివరన రిలీజ్ చేయాలని అనుకొంటున్నారు. ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశారు అంటూ ప్రధాన మీడియాలో కథనాలు వచ్చాయి. దాంతో ఈ సినిమా రిలీజ్‌పై గందరగోళం నెలకొన్నది. అయితే ఈ గందరగోళాన్ని నివారించేందుకు నిర్మాత ఎన్వీ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.

రూమర్లలో వాస్తవం లేదు అంటూ
గాడ్ ఫాదర్ మూవీపై వస్తున్న రూమర్లలో వాస్తవం లేదు. అవాస్తవ ప్రచారాన్ని నమ్మకండి. మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొంటాయి అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ స్పష్టం చేశారు.

గాడ్ ఫాదర్‌లో నటీనటులు, సాంకేతిక సిబ్బంది
నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సముద్ర ఖని, సత్యదేవ్, సునీల్, పూరీ జగన్నాథ్ తదితరులు
దర్శకత్వం: మోహన్ రాజా
డైలాగ్స్: లక్ష్మీ భూపతి
నిర్మాతలు: రాంచరణ్, ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్
మ్యూజిక్: థమన్ ఎస్
సినిమాటోగ్రఫి: నిరవ్ షా
బ్యానర్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్
రిలీజ్ డేట్: 2022-10-05


Click it and Unblock the Notifications











