twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Godfather Public Talk: గాడ్ ఫాదర్‌కు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్ అయినా..

    |

    యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్ని విభాగాల్లో తనదైన శైలిని ఏర్పరచుకుని సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ఆయన.. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత వేగంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటించారు. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో మీరే చూడండి!

    గాడ్ ఫాదర్‌గా మారిన చిరంజీవి

    గాడ్ ఫాదర్‌గా మారిన చిరంజీవి


    మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే 'గాడ్ ఫాదర్'. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు. క్రేజీ కాంబోలో వస్తున్న దీన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో విలక్షణ హీరో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించారు. థమన్ దీనికి సంగీతం సమకూర్చాడు.

    అలాంటి కథ... అంచనాలతోనే

    అలాంటి కథ... అంచనాలతోనే


    పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఓ ఫ్యామిలీ పెద్ద, రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలు కొడుకుకు అప్పగిస్తారు. అతడికి సమస్యలు వచ్చిన సమయంలో హీరో పాత్ర ఎంట్రీ ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. అసలు ఆ కుటుంబానికి, హీరోకు సంబంధం ఏంటి? హీరోకు మాఫియా డాన్‌ ఎలా పరిచయం ఏర్పడింది? అనే అంశాలతో 'గాడ్ ఫాదర్' మూవీ తెరకెక్కింది.

    రికార్డు స్థాయిలో బిజినెస్ చేసి

    రికార్డు స్థాయిలో బిజినెస్ చేసి

    చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 35 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 70.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 6.50 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలుపుకుని రూ. 91 కోట్ల బిజినెస్ చేసుకుంది.
    చిరంజీవి మూవీకి టాక్ ఏంటి?

    చిరంజీవి మూవీకి టాక్ ఏంటి?


    మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీ పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు విశేషమైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటి వరకూ వచ్చిన ట్వీట్లను చూస్తుంటే ఇది బ్లాక్‌బస్టర్ హిట్ అని అర్థం అవుతోంది.

    ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ ఇలా

    ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ ఇలా


    'గాడ్ ఫాదర్' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ మోహన్ రాజా చాలా తక్కువ సమయమే తీసుకున్నాడట. చిరంజీవి సూపర్బ్ ఎంట్రీ, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ఫస్టాఫ్ అద్భుతంగా ఉందట. అయితే, సెకెండాఫ్ కూడా బాగున్నప్పటికీ సల్మాన్ ఖాన్ ఎంట్రీ తర్వాత కథ గాడితప్పుతుందని వీక్షకులు చెబుతున్నారు.

    సినిమా ప్లస్‌... మైనస్‌లు ఇవే

    సినిమా ప్లస్‌... మైనస్‌లు ఇవే

    'గాడ్ ఫాదర్' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో చిరంజీవి వన్ మ్యాన్ షో చేశారట. అలాగే, కథ, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్, పవర్‌ఫుల్ పొలిటికల్ డైలాగ్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని అంటున్నారు. అయితే, కామెడీ లేకపోవడం, కొంత ల్యాగ్ అనిపించడం ఈ సినిమాకు మైనస్ అని టాక్.
    మొత్తంగా మూవీ ఎలా ఉంది

    మొత్తంగా మూవీ ఎలా ఉంది

    తాజా సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చింది. ఇందులో చిరు మార్కు మాస్ యాక్షన్‌, ఫ్యాన్స్ కోరుకునే స్వాగ్ అద్భుతంగా ఉందట. 'లూసీఫర్' స్టోరీని మార్చకున్నా తెలుగులోకి చక్కగా అనువాదం చేశారట. మొత్తంగా ఈ మూవీ అన్ని వర్గాల వాళ్లనూ అలరించే విధంగా ఉందని తెలిసింది.
    అసలైన కమ్‌బ్యాక్ ఇదేనంటూ

    అసలైన కమ్‌బ్యాక్ ఇదేనంటూ

    'గాడ్ ఫాదర్' మూవీ విడుదల సందర్భంగా మెగా ఫ్యాన్స్‌ చేస్తున్న ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి ఇదే పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్ మూవీ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంతలా ఈ చిత్రంలో ఆయన యాక్టింగ్, డైలాగ్స్, ఫైట్స్, గ్రేస్‌తో ఆకట్టుకున్నారట. దీనికితోడు డైరెక్టర్ కూడా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని చెప్తున్నారు.

    English summary
    Megastar Chiranjeevi Did Godfather Movie Under Mohan Raja Direction. Now Lets See This Movie Twitter Review. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ అనే సినిమా చేశారు. మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X