twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    GodFather: తార్ మార్ తక్కర్ మార్ అంటూ.. సల్మాన్ ఖాన్ తో కలిసి అదరగొట్టిన మెగాస్టార్..

    |

    మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న తదుపరి సినిమా గాడ్ ఫాదర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అభిమానులలో కూడా ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఆగస్టు 15వ తేదీన ఆంచనాల స్థాయి మరింత పెరిగే విధంగా గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన సాంగ్ కూడా విడుదల చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ప్రోమో వివరాల్లోకి వెళితే..

    సరికొత్త లుక్

    సరికొత్త లుక్

    మలయాళం సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను సరికొత్త యాక్షన్ పొలిటికల్ డ్రామాగా దర్శకుడు మోహన్ రాజా వెండితెరపైకి తీసుకురాపోతున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ కూడా గతంలో ఎప్పుడూ లేనివిధంగా కనిపిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ కూడా బిగ్ స్క్రీన్ పై మెగాస్టార్ ను చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

    న్యూ సాంగ్ తో హడావుడి

    న్యూ సాంగ్ తో హడావుడి

    ఇదివరకే మెగాస్టార్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా అభిమానుల్లో మంచి అంచనాలను పెంచింది. ఇక ఇప్పుడు ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్ తో మెగాస్టార్ చిరంజీవి చేసిన డ్యాన్స్ సాంగ్ ప్రోమో కూడా విడుదల చేశారు. గత రెండు మూడు రోజులుగా ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక థమన్ కూడా ఫ్యాన్స్ విజిల్స్ వేసే విధంగా ఒక సాంగ్ రాబోతోంది అని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వస్తున్నాడు.

    సల్మాన్, మెగాస్టార్ స్టైలిష్ డ్యాన్స్

    సల్మాన్, మెగాస్టార్ స్టైలిష్ డ్యాన్స్

    ఫైనల్ గా ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ఆ సాంగ్ ప్రోమో రానే వచ్చింది. అసలైన సాంగ్ 15వ తేదీన విడుదల సీబీయానున్నారు. ఇక ప్రోమోలో మెగాస్టార్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ చేత కూడా ఈ పాట స్టెప్పులు వేయించే విధంగా ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ టాలీవుడ్ మెగాస్టార్ ఇద్దరు కూడా ఎవరికి వారు వారి స్టెప్పులతో సమానంగా మెప్పించారు.. అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

    థమన్ మ్యూజిక్ అదిరిపోయేలా..

    థమన్ మ్యూజిక్ అదిరిపోయేలా..

    ఈ పాటకు థమన్ అందించిన మ్యూజిక్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. థమన్ కు కూడా మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేయడం ఇదే మొదటిసారి కాబట్టి ప్రతి సాంగ్ కూడా హైలెట్ అయ్యే విధంగా తమన్ వర్క్ చేయబోతున్నట్లు ఈ పాటతో రుజువయింది. ఫస్ట్ పాటనే ఈ రేంజ్ లో క్లిక్ అయింది అంటే ఇక రాబోయే రోజుల్లో థమన్ ఇంకా ఎలాంటి ట్యూన్స్ అందిస్తాడో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన తెలుగు హిందీలో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

    English summary
    Godfather movie first song released Megastar chiranjeevi dance with salman khan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X