GodFather Pre release event Live ఇసుక వేస్తే రాలనంత జనం.. ఫ్యాన్స్‌కు పోలీసులు వార్నింగ్!
మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక అనంతపురంలో అంగరంగవైభవంగా జరుగుతున్నది. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురం ఏఎన్‌పీ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ మెగాభిమానులతో కిక్కిరిసింది. ఇసుకేస్తే రాలనంత జనం, అభిమానులు పొటెత్తారు. ఈ కార్యక్రమంలో అభిమానులను, ప్రేక్షకులను సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సభ్యులు, నటీనటులు మాట్లాడుతూ

అదిరిపోయే ఫైట్ అంటూ రామ్ లక్ష్మణ్ స్పీచ్
గాడ్‌ఫాదర్ చిత్రంలో చిరంజీవి గారితో ఒక స్టైలిష్, సూపర్ ఫైట్ కంపోజ్ చేశాం. మా జీవితానికి సరిపోయేంతగా.. ఇక చాలూ అనే విధంగా ఆ ఫైట్ ఉంటుంది. డైరెక్టర్ ఆ ఫైట్ చూసి కాల్ చేశారు. పంచెకట్టులో చిరంజీవి నడిచి వస్తుంటే.. తెలుగుదనం ఉట్టిపడింది. సీమలో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్‌ను బేస్ చేసుకొని ఫైట్స్ కంపోజ్ చేశాం. తమన్ మ్యూజిక్ సూపర్‌గా ఉంది అని రామ్ లక్ష్మణ్ అన్నారు.
అయితే ఓ దశలో అభిమానులు స్టేజీ వద్దకు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అలాగే బారికేడ్లను తొలగించుకొనేందుకు ప్రయత్నించడంతో అనంతపురం పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారి మాట్లాడుతూ.. మీరు ముందుకు దూసుకు వచ్చే సన్నివేశాలు సీసీటీవీల్లో రికార్డు అవుతున్నాయి. నిబంధనలను అతిక్రమించితే చట్టపరమైన చర్యలు తీసుకొంటాం. మీరు కార్యక్రమానికి వచ్చిన తర్వాత పోలీసులకు సహకరించాలి. మీరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చిన్నపిల్లలు కాదు. మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తతో వ్యవహరించాలి. మీరు ఒకరి అభిమానులైన తర్వాత ఆయన హుందాతనాన్ని గుర్తుంచుకోవాలి. వేడుకకు అంతరాయం కలిగించకూడదు అని కోరుతున్నాం అని అన్నారు.


Click it and Unblock the Notifications










