For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Godfather: చిరంజీవి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. సినిమాలో ఆ పాట ఉండదు కానీ!

  |

  ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అలా సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిన ఆయన.. ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడాయన 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటించారు. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రూపొందిన విషయం తెలిసిందే.

  పైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షో

  కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన 'గాడ్ ఫాదర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇందులో బడా స్టార్లను భాగం చేశారు. ముఖ్యంగా ఈ మూవీలో చిరంజీవి సోదరి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. అలాగే, హీరోను కాపాడే మాఫియా డాన్ రోల్‌లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. దీంతో ఈ చిత్రం దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికితోడు ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌, తాజాగా వచ్చిన ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన రావడంతో పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి.

  Godfather: Thaar Maar song come during the end Titles

  టాలీవుడ్ స్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' మూవీని అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారు. దీనికి సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చిరంజీవి కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. అలాగే, బుధవారమే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీలోని సాంగ్ గురించి తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఈ చిత్రంలో సల్మాన్‌తో కలిసి చిరు 'తార్ మార్' అనే సాంగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ పాట సినిమాలో కాకుండా.. శుభం కార్డు పడే ముందు వచ్చే టైటిల్ కార్డ్ సమయంలో వస్తుందట. ఇది ఒకరకంగా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూసే అని చెప్పొచ్చు.

  టూ పీస్ బికినీలో చరణ్ హీరోయిన్: ముఖం తప్ప ఆ పార్టులన్నీ కనిపించేలా!

  Godfather: Thaar Maar song come during the end Titles

  'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను చేశాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు.

  English summary
  Megastar Chiranjeevi did Godfather Under Mohan Raja Direction. This Movie Thaar Maar song come during the end Titles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X