GodFather Twitter Review మెగాస్టార్ కమ్ బ్యాక్.. గాడ్‌ఫాదర్ బ్లాక్‌బస్టర్ అంటూ
మలయాళంలో భారీ విజయం సాధించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో దర్శకుడు మోహన్ రాజా, మెగాస్టార్ కలయికలో గాడ్‌ఫాదర్‌గా రూపొందింది. రాంచరణ్, ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5 ప్రేక్షకుల ముందుకు వచ్చింద.ి ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత ఈ సినిమా గురించి నెటిజన్లు చేసిన ట్వీట్లు మీ కోసం..
చిరంజీవి అమేజింగ్
గాడ్‌ఫాదర్ మూవీ అక్టోబర్ 5న రిలీజైంది. 30 నిమిషాలు సినిమా చూసిన తర్వాత చిరంజీవి అమేజింగ్ అనిపించాడు. పవర్‌పుల్ ఎంట్రీ, పవర్‌పుల్ క్యారెక్టర్. తమన్ మ్యూజిక్ సినిమాకు లైఫ్‌గా మారాడు. విలన్‌గా సత్యదేవ్ పర్‌ఫెక్ట్. డైలాగ్స్ అదిరిపోయాయి.
చిరు బ్రహ్మండంగా కమ్ బ్యాక్
ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత చిరు బ్రహ్మండంగా కమ్ బ్యాక్ అయ్యారు. ఇంకా చిరంజీవి తనలో సత్తా ఉందని నిరూపించాడు. గాడ్‌ఫాదర్ క్లిన్ హిట్. ఎంజాయ్... భోళాశంకర్‌పై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
చిరంజీవి కమ్ బ్యాక్ తర్వాత
గాడ్‌ఫాదర్ సినిమాలో అన్నీ ఉన్నాయి. చిరంజీవి కమ్ బ్యాక్ తర్వాత ఏం కావాలో అవన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. రీమేక్‌ను అద్బుతంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా రూపొందించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా మోహన్ రాజాకే దక్కుతుంది. తమన్ బీజీఎం సూపర్‌గా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఫస్టాఫ్ ఎక్సలెంట్.
యూకేలో గాడ్‌ఫాదర్ ప్రీమియర్ చూశాను. ఫస్టాఫ్ ఎక్సలెంట్. సెకండాఫ్ డీసెంట్. ఓవరాల్‌గా బాస్ హిట్ సినిమా అందించారు. చిరంజీవి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కొన్ని సీన్లలో కళ్లతోనే నటించాడు. వావ్ అనిపించేలా ఫెర్ఫార్మెన్స్ ఉంది. ఓవరాల్‌గా గుడ్ మూవీ ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.
గాడ్‌ఫాదర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. నిజాయితీగా తీసిన రీమేక్. కథలోని ఆత్మను తీసుకొని చాలా మార్పులు చేసి.. ఎంగేజింగ్‌గా మార్చారు. మెగాస్టార్, తమన్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచారు. మార్పులు చేయడంలో తమకు తామే సాటి అని నిరూపించుకొన్నారు. గాడ్‌ఫాదర్ సినిమా బాగుంది అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.
గాడ్‌ఫాదర్ సినిమా బ్లాక్‌బస్టర్.
గాడ్‌ఫాదర్ సినిమా బ్లాక్‌బస్టర్. థ్యాంక్యూ చిరు సార్. మోహన్ రాజా సార్. థమన్ అన్న. రాంచరణ్ అన్న..యూనానిమస్ రివ్య్స్. యూనానిమస్ బ్లాక్‌బస్టర్ అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











