విభిన్న కథాంశంతో గోకులంలో గోవిందుడు.. విక్రమ్‌తో మూవీ తీసిన దర్శకుడు సరికొత్తగా!
కరోనావైరస్ లాక్‌డౌన్ తర్వాత చిన్న చిత్రాలకు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతుండటంతో తక్కువ బడ్జెట్‌తో విభిన్నమైన కథాంశాలతో నిర్మాతలు ముందుకు వస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత SR కల్యాణమండపం తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. దాంతో చిన్న నిర్మాతలకు జోష్ కలుగుతున్నది. ఈ కోవలోనే గోకులంలో గోవిందుడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాన్ని పీఎన్‌రెడ్డి చేస్తున్నారు. ప్రభాకర్ శివాల దర్శకత్వంలో గోకులంలో గోవిందుడు సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

గతంలో తమిళ సూపర్ స్టార్ అపరిచితుడు ఫేమ్ విక్రమ్‌తో ఊహ, వడ్డే నవీన్ హీరోగా శ్రీమతి కల్యాణం చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రభాకర్ తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
గోకులంలో గోవిందుడు పేరుతో ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ పతాకంపై వ్యాపారవేత్త పి.ఎన్.రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతోపాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుపుకొంటున్న గోకులంలో గోవిందుడు ఫిబ్రవరి ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లనుంది.
పీఆర్వో: ధీరజ్-అప్పాజీ
స్టిల్స్: రమణ
సినిమాటోగ్రఫీ: రాజేష్ కే కతూరి
నిర్మాత: పీఎన్ రెడ్డి
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ప్రభాకర్ శివాల


Click it and Unblock the Notifications