Golden Globe Awards 2026: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన సినిమాలు.. విన్నర్స్ లిస్ట్ ఇదే…
Golden Globe Awards 2026 winners: ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్‌తో పాటు వెబ్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలు, టీవీ షోలు ప్రతిష్ఠాత్మక 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 (Golden Globe Awards 2026)వేదికపై అరుదైన గౌరవం దక్కింది. 2025లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, అద్భుత నటన, వినూత్న కథనాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. హాలీవుడ్‌లో 'అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల పండుగ'గా పేరుగాంచిన గోల్డెన్ గ్లోబ్స్ ఈసారి కూడా భావోద్వేగాలు, విజయాలు, స్టార్‌ల సందడికి వేదికగా మారింది. హాలీవుడ్ ప్రముఖులు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ఈ అవార్డుల పండుగలో సత్తాచాటిన సినిమాలు, విజేతల పూర్తి జాబితా మీ కోసం..
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 వేడుక జనవరి 11న కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో ఉన్న బెవర్లీ హిల్టన్ (Beverly Hilton)హోటల్‌లో ఘనంగా జరిగింది. ప్రపంచ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన ఈ కార్యక్రమంలో రెడ్ కార్పెట్ ఫ్యాషన్, హాలీవుడ్ ప్రముఖుల హాజరు, అవార్డు స్వీకరణ సమయంలో చేసిన భావోద్వేగ ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాది వేడుకకు హోస్ట్‌గా మరోసారి నిక్కీ గ్లేజర్ (Nikki Glaser)వ్యవహరించారు. ఆమె తనదైన సరదా యాకరింగ్ తో సందడి చేశారు. భారతదేశంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల కార్యక్రమం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్ స్టార్ (Jio Hotstar)లో ప్రత్యక్ష ప్రసారం కావడం విశేషం.

సినీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఇవ్వాలనే లక్ష్యంతో హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (HFPA) గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ప్రారంభించింది. 1944 నుంచి ప్రతి ఏడాది ప్రారంభంలో ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకే కాకుండా అంతర్జాతీయ చిత్రాలను కూడా గుర్తించి పురస్కారాలు అందజేయడం గోల్డెన్ గ్లోబ్స్ ప్రత్యేకత. ప్రస్తుతం హెచ్ఎఫ్ ఫీఏ(HFPA)లో సుమారు 60 దేశాలకు చెందిన 105 మంది సభ్యులు ఉన్నారు. వారి సమ్మతితోనే విజేతలు ఎంపికవుతారు. సినిమా రంగంతో పాటు టెలివిజన్ రంగంలో ప్రతిభ చూపిన వారికి కూడా అవార్డులు ఇవ్వడం ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను అందిస్తోంది.
గోల్డెన్ గ్లోబ్స్- 2026అవార్డు విజేతలు (సినిమా)
ఉత్తమ నటుడు : తిమోతీ చలమెట్ (మార్టీ సుప్రీం)
ఉత్తమ నటి : రోజీ బేర్నీ (ఇఫ్ ఐ హేడ్ లెగ్స్ ఐడిడ్ కిక్ యూ)
ఉత్తమ సహాయ నటుడు (సినిమా): స్టెలన్ - సెంటిమెంట్ వాల్యూ
ఉత్తమ సహాయ నటి: టెయానా టేలర్ (ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్)
గోల్డెన్ గ్లోబ్స్- 2026అవార్డ్ విన్నర్స్ ( టెలివిజన్ సిరీస్)
ఉత్తమ టెలివిజన్ సిరీస్ (డ్రామా): ది వైట్ లోటస్
ఉత్తమ నటుడు : ఎరిన్ డోహెర్టీ (అడోలెసెన్స్)
ఉత్తమ సహాయ నటి : ఎరిన్ డోహెర్టీ (అడోలెసెన్స్)
ఉత్తమ నటుడు : స్టీఫెన్ గ్రాహం (అడోలెసెన్స్)
ఉత్తమ సహాయ నటుడు (టీవీ సిరీస్): ఓవెన్ కూపర్ - అడాల్సెన్స్
ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్ - వన్ బ్యాటిల్ ఆనథర్
ఉత్తమ స్క్రీన్‌ప్లే: పాల్ థామస్ ఆండర్సన్ - వన్ బ్యాటిల్ ఆనథర్
ఉత్తమ సినిమాటిక్ అండ్ బాక్స్ ఆఫీస్ అచీవ్‌మెంట్: స్పిన్నర్స్
ఉత్తమ యానిమేటెడ్ మోషన్ పిక్చర్: K-Pop డీమన్ హంటర్స్


Click it and Unblock the Notifications











