మెగా అభిమానులకు శుభవార్త.. స్పీడ్ పెంచేసిన పవన్ కళ్యాణ్.. క్రిష్‌ మూవీ అప్‌డేట్

మెగా అభిమానులు పండగ చేసుకునే విధంగా మరోసారి వెండితెర జోరు పెంచుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ స్టార్ హీరో మరోసారి సినిమాల్లో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 'పింక్' రీమేక్ షూటింగ్‌‌లో పాల్గొంటూనే క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేసేశాడు. వివరాల్లోకి పోతే..

పవర్ స్టార్ జోరు.. 25 సినిమాలు

పవర్ స్టార్ జోరు.. 25 సినిమాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. క్లాస్, మాస్ అనే తేడాలేకుండా ప్రతీ ఒక్కరూ పవన్ సినిమాలను ఆదరించినవారే.
సినీ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలోనే తన పవర్ ఏంటో నిరూపించిన ఆయన వెండితెరపై ఓ వెలుగు వెలుగుతూ 25 సినిమాలు పూర్తి చేశారు. ఆ తర్వాత రాజకీయ బాట పట్టారు. జనసేనానిగా ప్రజల చెంతకు చేరారు.

పవర్‌ఫుల్ స్కెచ్ పింక్ రీమేక్

పవర్‌ఫుల్ స్కెచ్ పింక్ రీమేక్

నిర్మాతల కోరిక, గతంలో ఆయన ఇచ్చిన కొన్ని కమిట్మెంట్స్ మేరకు తిరిగి వెండితెరపై కాలుమోపుతున్నారు పవన్. ఈ మేరకు ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో చురుకుగా ఉండేలా పవర్‌ఫుల్ స్కెచ్ వేసుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఇటీవలే పింక్ రీమేక్ సెట్స్ పైకి వచ్చేశారు పవన్ కళ్యాణ్.

 క్రిష్ పవన్ ఫిదా.. వెంటనే డిసైడ్

క్రిష్ పవన్ ఫిదా.. వెంటనే డిసైడ్

ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటూనే కొంత సమయాన్ని రాజకీయాల కోసం కేటాయిస్తున్నారు. ఇకపోతే తాజాగా క్రిష్ దర్శకత్వంలో మరో కొత్త సినిమా స్టార్ట్ చేసేసి తన సినిమాల స్పీడు ఇంకాస్త పెంచేశాడు పవన్. క్రిష్ చెప్పిన కథకు ఫిదా అయిన పవన్, ఈ సినిమా చేయడానికి వెన్తనె ఒప్పుకున్నాడట. చకచకా పనులు కావాలని చెప్పేశాడట.

 పవన్ 27.. పూజా కార్యక్రమాలు

పవన్ 27.. పూజా కార్యక్రమాలు

దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజే (జనవరి 29) పవన్‌తో సినిమా మొదలుపెట్టేశాడు క్రిష్. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించారు. పవన్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా జానపద నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది.

రెగ్యులర్ షూటింగ్.. క్రిష్ జాగ్రత్తలు

రెగ్యులర్ షూటింగ్.. క్రిష్ జాగ్రత్తలు

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 4 నుంచి మొదలుకానుంది. ఈ సినిమా షూటింగ్‌ను కంగారుగా కాకుండా పవన్ రాజకీయాల షెడ్యూల్స్‌కి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారట క్రిష్. గతేడాది ఎదుర్కొన్న పరాజయాలను పవన్ సినిమాతో మరిపించాలని ఆయన జాగ్రత్త పడుతున్నారట.

Recommended Video

Can Pawan Kalyan Manage His Work ? | PSPK 26 | Janasena | Amaravati
పవన్ సరసన యంగ్ హీరోయిన్

పవన్ సరసన యంగ్ హీరోయిన్

ఇక ఈ సినిమాలో పవన్ సరసన నటించబోయే హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపిన క్రిష్.. ఆమె కాల్ షీట్స్ కూడా తీసుకున్నారని ఇన్ సైడ్ టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X