మెగా అభిమానులకు పండగే పండగ: PSPK26 ఫస్ట్‌లుక్ వచ్చేసిందండోయ్..
మెగా అభిమానులకు ఈ రోజు నిజంగా పండగ రోజే. ఎందుకంటే రెండేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ మరోసారి చూస్తున్నారు కాబట్టి. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ తన 26వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపారు మేకర్స్. వివరాల్లోకి పోతే..
Recommended Video

పవన్ రీ ఎంట్రీ.. వరుస సినిమాలకు ఓకే
'అజ్ఞాతవాసి' మూవీ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమై రాజకీయాలతో బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చారు. తన అభిమానులను కనివిందు చేసేందుకు గాను వరుస సినిమాలకు ఓకే చెప్పారు. కెరీర్ స్టార్ట్ చేసి 25 సినిమాలు పూర్తిచేసిన ఆయన ప్రస్తుతం 26, 27 సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ లీడ్ రోల్.. ‘పింక్' తెలుగు రీమేక్
పవన్ తన 26వ సినిమాగా ‘పింక్' రీమేక్ యాక్సెప్ట్ చేశారు. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సి నటించిన ‘పింక్' సినిమాకు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. బోణీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఉత్కంఠకు తెరదించుతూ పవన్ లుక్..
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ సినిమాలో పవన్ రోల్ ఎలా ఉండనుంది? రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ లుక్ ఏ రకంగా ఉండబోతోంది? అనే దానిపై మెగా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు మేకర్స్.

వచ్చేశాడు.. వకీల్ సాబ్
ముందుగా అనుకున్నట్లుగానే ఈ సినిమాకు 'వకీల్ సాబ్' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చేతిలో బుక్ పట్టుకొని, కళ్లజోడుతో ఎంతో సైలిష్‌గా కనిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ లుక్ చూసి మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

సమ్మర్ స్పెషల్.. రిలీజ్ డేట్
ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ మూవీ ఫస్ట్ సాంగ్ విడుదల కానుందని ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రకటించారు. ఇకపోతే మే 23న ఈ సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తోందట చిత్రయూనిట్.
సంబరాల్లో పవన్ ఫ్యాన్స్..
పవన్ కళ్యాణ్ పోస్టర్ తిరిగి రెండేళ్ల తర్వాత చూడబోతున్నామనే ఆనందంలో ఈ రోజు ఉదయం నుంచే ఆయన అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. డోలు వాయిస్తూ, పవన్ పాటలకు స్టెప్పులేస్తూ పలు చోట్ల గుంపులు గుంపులుగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు పవన్ ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











