సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. మహేష్ బాబు రిమార్కబుల్ రికార్డ్
మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తూ టాక్ అఫ్ ది టాలీవుడ్ అవుతోంది. విడుదలకు ఇంకా నెలన్నర పైగా సమయం ఉండగానే ఈ సినిమా ఈ రేంజ్‌లో దూసుకుపోవడం చూసి సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ అయితే టాలీవుడ్ స్టామినా ఏంటో తెలియజేస్తోంది.

మహేష్ బాబు హంగామా.. 'సరిలేరు నీకెవ్వరు'
సౌత్‌లో తొలి 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా ఆల్‌టైం రికార్డ్ నమోదు చేసింది 'సరిలేరు నీకెవ్వరు' టీజర్. ఆ తర్వాత కూడా ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్లుగా సూపర్ జోష్ లో వ్యూస్ రాబడుతూ సరికొత్త సంచలనాలకు నాంది పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ రిమార్కబుల్ ఫీట్ అధిగమించింది ఈ టీజర్.

ఎన్నడూ లేని విధంగా.. మొదటి స్థానం మహేష్‌దే
ఇప్పటిదాకా టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా మరో రికార్డును కూడా బ్రేక్ చేసింది 'సరిలేరు నీకెవ్వరు' టీజర్. అత్యంత వేగంగా 20 మిలియన్ల వ్యూస్ రాబట్టిన టీజర్‌గా రెకార్డుకెక్కింది. అంతేకాదు యూట్యూబ్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

72 గడిచినా దిగడం లేదు..
యూట్యూబ్ ట్రెండింగ్‌లో మొదటి స్థానం కొట్టేసి సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేసిన 'సరిలేరు నీకెవ్వరు' టీజర్.. 72 గడిచినా అస్సలు దిగేదే లేదన్నట్లుగా అదే స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇలా తెలుగు చిత్రసీమలోనే రిమార్కబుల్ రికార్డ్ నమోదు చేసింది. దీంతో ఆనందంలో మునిగిన చిత్రయూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.

సరిలేరు సంగతులు.. లేడీ అమితాబ్ బచ్చన్ ఎంట్రీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు దేవి శ్రీ బాణీలు కడుతున్నారు. జనవరి 11వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో మహేష్ సరసన క్రేజీ భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తోంది.
Recommended Video

సరిలేరు యూనిట్ సంబరాలు
విడుదలకు ముందే 'సరిలేరు నీకెవ్వరు' సెన్సషన్స్ చూసి తెగ సంబరపడుతోంది చిత్రయూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రికార్డులకు సంబదించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ ''మా దగ్గర బేరాల్లేవమ్మా'' అని డైరెక్ట్‌గా చెప్పేస్తోంది. ఇదంతా చూస్తుంటే ఈ సంక్రాంతికి సరిలేరు సంచలనాలు ఊహాతీతం అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











